Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : ఇంకొక్కడు
By: Tupaki Desk | 8 Sep 2016 10:27 AM GMTచిత్రం : ‘ఇంకొక్కడు’
నటీనటులు: విక్రమ్ - నయనతార - నిత్యా మీనన్ - నాజర్ - తంబి రామయ్య - కరుణాకరన్ తదితరులు
సంగీతం: హారిస్ జైరాజ్
ఛాయాగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
నిర్మాతలు: శిబు తమీన్స్ - నీలం కృష్ణారెడ్డి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఆనంద్ శంకర్
సినిమా కోసం ప్రాణం పెట్టే నటుడు విక్రమ్. కానీ అతడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కి చాలా కాలమైంది. ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్ నుంచి అభిమానులు ఆశించే సరైన సినిమా రాలేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘ఐ’ కూడా నిరాశ పరిచింది. అయినా విక్రమ్ ప్రయోగాలు ఆపలేదు. ఇప్పుడు హీరోగా.. విలన్ గా రెండు వైవిధ్యమైన పాత్రలతో ‘ఇంకొక్కడు’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యువ దర్శకుడు ఆనంద్ శంకర్ రూపొందించిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
అఖిల్ (విక్రమ్) ఒకప్పుడు రా ఏజెంటుగా పని చేసి.. ఓ ఆపరేషన్లో భాగంగా తన భార్య మీరా (నయనతార)ను కోల్పోయాక తన వృత్తిని వదిలేసి మామూలు జీవితం గడుపుతుంటాడు. ఐతే తన భార్య చావుకు కారణమైన వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడని.. అసాంఘిక కార్యకలాపాలతో పెద్ద ఉపద్రవానికి కారణమవబోతున్నాడని అఖిల్ కు తెలుస్తుంది. ఈ ఉపద్రవాన్ని అడ్డుకోవడానికి పోలీసులు అఖిల్ సాయం కోరతారు. ఇంతకీ అఖిల్ భార్య చావుకు కారణమైన వ్యక్తి ఎవరు.. అతడి వల్ల ఎదురవబోతున్న ప్రమాదమేంటి.. అఖిల్ దాన్ని ఎలా అడ్డుకున్నాడు.. అన్నది తెరమీదే చూడాలి.
కథనం - విశ్లేషణ:
తమిళ రచయితలు.. దర్శకులను ఒక విషయంలో ఎంత పొగిడినా తక్కువే. చరిత్రను శోధించి ఎవ్వరూ గమనించని విషయాల్ని వెలికి తీసి.. వాటి ఆధారంగా కొత్త కథలు పుట్టించడంలో.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడంలో ఇండియాలో వారి తర్వాతే ఎవరైనా. యువ దర్శకుడు ఆనంద్ శంకర్ కూడా రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లోకి హిట్లర్ తన సైనికుల్ని ఉత్తేజితం చేయడానికి ఉపయోగించిన ఓ మందు గురించి తెలుసుకుని.. దాని నేపథ్యంలో ‘ఇరుముగన్’ కథను అల్లుకున్నాడు.
హిట్లర్ వాడిన మందు విషయంలో శాస్త్రీయత.. వాస్తవికత ఎంతో కానీ.. ఆ పాయింట్ ఆధారంగా కథ అల్లినందుకు మాత్రం ఆనంద్ శంకర్ ను అభినందించాలి. ‘ఇంకొక్కడు’ సినిమాకు బేసిక్ ప్లాట్ ప్రధాన ఆకర్షణ. ఇక హీరోగానే కాక.. హిజ్రా విలన్ పాత్రలోనూ గొప్ప అభినయం చూపించిన విక్రమ్ గురించి ఎంతచెప్పినా తక్కువే. కాకపోతే దర్శకుడు ఆ ‘ఐడియా’ చుట్టూ సరైన కథను అల్లుకోవడంలో.. ఆసక్తికర కథనాన్ని కూర్చడంలో మాత్రం విఫలమయ్యాడు. ప్లాట్ ఆసక్తి రేకెత్తించినా.. విక్రమ్ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నా.. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని కుదురుగా కూర్చోబెట్టేంత కంటెంట్ మాత్రం ‘ఇంకొక్కడు’లో లేదు.
ప్లాట్ విషయంలో కొత్తగా ఆలోచించిన ఆనంద్.. కథనం విషయంలో మాత్రం ఆ వైవిధ్యం చూపించలేకపోయాడు. విలన్ పాత్ర గురించి ఎంతో బిల్డప్ ఇస్తూ ప్రథమార్ధంలో కథనాన్ని నడిపించి.. తీరా ఆ విలన్ పరిచమయ్యాక మాత్రం తేల్చిపడేశాడు. ఆ మందుకు సంబంధించి ఆరంభంలో సన్నివేశాలు చూస్తే.. హై స్టాండర్డ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ తర్వాత మాత్రం సినిమా స్థాయి అంతకంతకూ పడిపోయి.. చాలా సాదాసీదాగా మారిపోతుంది.
పోలీసులకు పట్టుబడ్డ విలన్.. జైల్లో తనకేదో అయిపోయినట్లు కిందపడి గిలగిలా కొట్టేసుకోవడం.. తాళం తీయగానే అటాక్ చేసి బయటికెళ్లపోవడం.. ఆ తర్వాత హై సెక్యూరిటీ ఉన్న హాస్పిటల్లోకి చాలా తమాషాగా వచ్చేసి మంత్రిని చంపేయడం.. కంట్రోల్ - ఆల్ట్ - డెలీట్ ప్లస్ 3 కొట్టగానే ఎలాంటి సమాచారాన్నయినా హ్యాక్ చేసేయొచ్చని హీరోయిన్ చెప్పడం.. ఇలాంటి సన్నివేశాలన్నీ చూశాక ‘ఇంకొక్కడు’ మీద ప్రథమార్ధంలో కలిగిన ఇంప్రెషన్ అంతా క్రమక్రమంగా పడిపోతూ వస్తుంది. ప్రథమార్ధంలో కూడా బేసిక్ ప్లాట్ కు సంబంధించిన సన్నివేశాలు మినహా కొత్తదనం ఏమీ లేకున్నా.. కథనం ఆసక్తికరంగానే సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు ఓ 20 నిమిషాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది.
హీరో-విలన్ మీటయ్యే ముందు తీసుకొచ్చిన హైప్ క్యూరియాసిటీ తీసుకొస్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఐతే ద్వితీయార్ధంలో హీరోయిన్ గురించి అసలు రహస్యం విప్పడంతోనే సినిమా స్థాయి ఒక్కసారిగా పడిపోతుంది. నుదుటున బుల్లెట్ తగిలి.. లోయలో పడ్డ హీరోయిన్ చనిపోలేదని.. ఆమెకు గిరిజనులు నాటువైద్యం చేసి బతికించారని చెప్పడంతోనే ద్వితీయార్ధం ఏ స్టాండర్డ్ తో సాగబోతోందో అర్థమైపోతుంది. ఆ తర్వాత పైన చెప్పుకున్న సిల్లీ సీన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపడతాయి. విక్రమ్ ‘లవ్’ పాత్రలో గొప్పగా నటించినా.. ఆ పాత్ర మాత్రం అంత ఆసక్తికరంగా లేదు. ఆ పాత్ర నుంచి ఏదో ఆశిస్తే దర్శకుడు ఇంకోదో చూపించాడు. ఆ పాత్ర మిస్టీరియస్ గా లేకపోగా.. అక్కడక్కడా కామెడీ చేస్తూ సిల్లీగా అనిపిస్తుంది.
ఒక వైవిధ్యమైన సైన్స్ ఫిక్షన్ సినిమాలా మొదలైన ‘ఇంకొక్కడు’ చివరికి మామూలు హీరో వెర్సస్ విలన్ సినిమాలాగా ముగుస్తుంది. ద్వితీయార్ధం అంతా ప్రెడిక్టబుల్ గా ఉండటం ఒక మైనస్ అయితే.. లెంగ్త్ మరీ ఎక్కువవడం మరో ప్రతికూలత. ఓవరాల్ గా ‘ఇంకొక్కడు’లో బేసిక్ ప్లాట్.. విక్రమ్ అభినయం.. కళ్లు చెదిరే యాక్షన్ దృశ్యాలు.. టెక్నికల్ వాల్యూస్ ప్రేక్షకుల్ని కొంత వరకు ఎంటర్టైన్ చేస్తాయి. అంతకుమించి ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.
నటీనటులు:
విక్రమ్ నటన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. మూడు భిన్నమైన అవతారాల్లో విక్రమ్ ఆకట్టుకున్నాడు. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. విక్రమ్ అభిమానులైతే అతడి నటన కోసమే సినిమాకు వెళ్లిపోవచ్చు. ‘లవ్’ పాత్రలో విక్రమ్ బాడీ లాంగ్వేజ్.. నటన చూస్తే నటుడిగా స్థాయి ఏంటో అర్థమవుతుంది. ఐతే ఆ పాత్రకు వేసిన మేకప్ మాత్రం అదోలా ఉంది. పాత్ర కూడా అంత బలంగా లేదు. అఖిల్ పాత్రలోనూ విక్రమ్ ఇంటెన్సిటీ చూపించాడు. నయనతార గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకుంది. ఆమె నటన ఓకే. నిత్యామీనన్ గురించి మాత్రం చెప్పడానికేం లేదు. తంబిరామయ్య కామెడీ ఇరిటేట్ చేస్తుంది తప్ప నవ్వించదు. సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలు ఇంకేవీ లేవు.
సాంకేతిక వర్గం:
హారిస్ జైరాజ్ పాటల్లో పెద్దగా ప్రత్యేకత చూపించలేదు. నిజానికి సినిమాలో పాటలు కథనానికి అడ్డంకిలా అనిపిస్తాయి. హెలెనా ఒక్కటే కొంచెం రిజిస్టరవుతుంది. ద్వితీయార్ధంలో విక్రమ్-నయన్ మధ్య వచ్చే పాట బాగుంది కానీ.. అక్కడా పాట పూర్తిగా అనవసరం. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో హారిస్ అదరగొట్టాడు. ఆర్.డి.రాజశేఖర్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా అంతటా ఉన్నత ప్రమాణాలతో కనిపిస్తుంది. దర్శకుడు ఆనంద్ శంకర్ ప్లాట్ విషయంలో.. కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ప్రథమార్ధం వరకు గ్రిప్ చూపించిన ఆనంద్.. ద్వితీయార్ధంలో రొటీన్ స్క్రీన్ ప్లేను ఫాలో అయిపోవడంతో సినిమా గ్రాఫ్ పడిపోయింది. ద్వితీయార్ధం విషయంలో సేఫ్ గేమ్ ఆడకుండా కాస్త వర్క్ చేసి ఉంటే సినిమా మరోలా ఉండేది.
చివరగా: ప్లాట్ ఒకే.. విక్రమ్ ‘డబుల్’ ఓకే.. కానీ..!?
రేటింగ్- 2.5/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre