Begin typing your search above and press return to search.
ఓటీటీ రిలీజ్: నిర్మాతలపై విమర్శలు గుప్పించిన ఐనాక్స్
By: Tupaki Desk | 15 May 2020 5:30 AM GMTసినిమాలు రిలీజ్ చెయ్యాలంటే థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో డైరెక్ట్ గా ఒటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసేందుకు కొందరు ఫిలింమేకర్లు రెడీ అవుతున్నారు. సౌత్ లో చిన్న సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీ చేసేందుకు సై అంటున్నారు కానీ పెద్ద సినిమాలను మాత్రం థియేటర్లలోనే విడుదల చేస్తామని పట్టుదలగా ఉన్నారు. కానీ బాలీవుడ్ లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
పెద్ద స్టార్ హీరోలే ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్నారు. అక్షయ్ కుమార్ నెక్స్ట్ సినిమా ఓటీటీ లోనే రిలీజ్ కానుంది. దానికంటే ముందుగా అమితాబ్ బచ్చన్.. ఆయుష్మాన్ ఖురానా నటించిన 'గులాబో సితాబ్' కూడా ఓటీటీ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతోంది. జూన్ 12 నుంచి తమ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేస్తామ నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం ప్రముఖ మల్టిప్లెక్స్ చెయిన్ ఐనాక్స్ వారికి నచ్చలేదు. దీంతో సినిమా టైటిల్ చెప్పకుండా నిర్మాతలను విమర్శిస్తూ ఒక ఓపెన్ లెటర్ విడుదల చేశారు. ఇందులో నిర్మాతలు - సినిమా థియేటర్లు ఎప్పుడూ భాగస్వాములుగా ఉండాలని.. నిర్మాతలు ఓటీటీ బాట ఎంచుకుంటే తమకు సమయం వచ్చినపుడు మల్టిప్లెక్సులు కూడా తామేంటి అనేది చూపిస్తాయని పరోక్షంగా హెచ్చరించారు. అయితే ఈ లేఖలోనే నిర్మాతలను ఓటీటీ పై మొగ్గు చూపుతూ థియేట్రికల్ రిలీజ్ ను మర్చిపోవడం సరికాదని సూచించారు.
ఐనాక్స్ లేఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా విడుదల ఓ నాలుగు నెలలు ఆలస్యం అయిన పక్షంలో వడ్డీలు ఎవరు భరిస్తారు? ఒకవేళ మల్టి ప్లెక్స్ చెయిన్లు అలా భరిస్తే ఎన్ని నెలలైనా ఆగుతామని ఒకరు మల్టి ప్లెక్స్ కు చురకలు అంటించారు. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి నష్టాలను తగ్గించుకోవడం కోసం ఓటీటీ రిలీజులకు వెళ్తున్నారని అన్నారు. అయితే దీనికి వ్యతిరేకంగా వాదించేవారు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఎక్కువ రేట్లు ఇచ్చే ఓటీటీలు తర్వాత స్ట్రీమింగ్ రైట్స్ సగానికి సగం తగ్గిస్తే అప్పుడేం చేస్తారని.. థియేటర్లకు రాక తప్పదని అంటున్నారు. ఏదేమైనా ఈ మార్పులు ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయని చెప్పకతప్పదు.