Begin typing your search above and press return to search.
హే అఖిల్... డ్యాన్స్ ఇరగదీశాడంతే!
By: Tupaki Desk | 8 Oct 2015 9:30 AM GMTతెలుగు తెరపైకి అఖిల్ అక్కినేని రూపంలో మరో సూపర్ డ్యాన్సర్ వచ్చేశాడా? ఇప్పటిదాకా డ్యాన్స్ లో తిరుగులేని కథానాయకులుగా చెలామణీ అవుతున్న చరణ్ - ఎన్టీఆర్ - బన్నీలాంటోళ్లకు అఖిల్ గట్టి పోటీనివ్వబోతున్నాడా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. అఖిల్ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది చిత్రబృందం. అఖిల్ తొలి చిత్రం కావడంతో ప్రత్యేకమైన హంగులతో సినిమాని తీర్చిదిద్దుతున్నారు.
మరింత కలర్ ఫుల్ గా - ఎఫెక్టివ్ గా ఉండేలా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వి.వి.వినాయక్ వారం రోజులుగా చెన్నైలో మకాం వేసి పనులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో ఎడిటింగ్ రూమ్ నుంచి కొన్ని విషయాలు బయటికొచ్చాయి. సినిమాలో అఖిల్ డ్యాన్స్ దుమ్ము రేగిపోయిందట. హే... అఖిల్ అని సాగే ఇంట్రడక్షన్ సాంగ్ లోనైతే అఖిల్ స్టెప్పులు కనీవినీ ఎరుగని రీతిలో ఉన్నాయట. ఆ పాటని మూడు భారీ సెట్లలో షూట్ చేయించారు. జానీ మాస్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ సాంగ్ ని కంపోజ్ చేశాడట. ఆ పాట చూస్తే బన్నీ - ఎన్టీఆర్ - చరణ్ లే గుర్తుకొస్తారని, వాళ్ల స్థాయిలో అఖిల్ డ్యాన్స్ వేశాడని చెప్పుకొంటున్నారు.
మామూలుగా ఓ కథానాయకుడి తొలి సినిమా అంటే, ఇతర కథానాయకులు చేసిన తొలి సినిమాలతో పోల్చి చూస్తుంటారు. అయితే అఖిల్ సినిమాని మాత్రం ఇప్పుడు స్టార్ల సినిమాలతో పోల్చి చూసుకోవాల్సిందే అని టాలీవుడ్ లో చెప్పుకొంటున్నారు. యాక్టింగ్ లోనూ - ఫైట్లలోనూ - డ్యాన్సుల్లోనూ... ఇలా ఏ విషయంలోనూ తక్కువ కాకుండా చేశాడట. చిన్నప్పట్నుంచీ సినిమా ఇండస్ట్రీలో ఉండటం, కొన్నేళ్లుగా మంచి ట్రైనింగ్ తీసుకొంటుండటంతోనే అఖిల్ అంత ఎఫెక్టివ్ గా నటించడాని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అఖిల్ సినిమా రషెస్ చూసిన కొద్దిమంది నిర్మాతలు, బయ్యర్లు అవాక్కయ్యారట. ఓ ప్రముఖ నిర్మాత అఖిల్ రెండో సినిమాకోసం రూః 12 కోట్లు పారితోషికం ఇస్తూ ఓ ఒప్పందం కూడా చేసుకొన్నాడని తెలిసింది. అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున తర్వాత మళ్లీ ఆ స్టార్ లీగ్ కి వెళ్లే కథానాయకుడిగా అఖిల్ అవతరించాడని చెప్పుకోవచ్చు.