Begin typing your search above and press return to search.

స్పై పాత్రకు స్పూర్తి ఎవరంటే...

By:  Tupaki Desk   |   30 Dec 2015 1:30 PM GMT
స్పై పాత్రకు స్పూర్తి ఎవరంటే...
X
వరుణ్ తేజ్ మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. డైరెక్టర్ క్రిష్ తో రాయబారి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇందులో మేథావి అయిన ఓ స్పై పాత్రను వరుణ్ తేజ్ పోషించనున్నాడు. ఇది ఇప్పటివరకూ తెలిసిన న్యూస్. మరి ఈ కాన్సెప్ట్ వెనుక ఎవరున్నారు ? కంచె తీయడానికి తాను వైజాగ్ లో చూసిన ఓ రియల్ బాంబ్ స్ఫూర్తి అని క్రిష్ గతంలో చెప్పాడు. రెండో ప్రపంచయుద్ధం గురించి అప్పుడే డీటైల్స్ సేకరించి, స్టోరీ రాసుకున్నాడు.

ఇప్పుడు రాయబారి వెనుక కూడా అలాంటి కథే ఒకటి ఉంది. ఈ స్పై పాత్రకు స్ఫూర్తినిచ్చినది ఓ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు.. క్రిష్ తాతయ్యే. నిజానికి క్రిష్ తాతయ్య ఓ సీబీ సీఐడీ ఆఫీసర్. ఆ విభాగం దేశంలోని ప్రతీ రాష్ట్రంలోనూ అనేక క్లిష్టమైన కేసులను ఛేదిస్తూ ఉంటుంది. పోలీసుల విచారణలో ఏదైనా కేసు తేలకపోతే.. వెంటనే గుర్తొచ్చేది సీబీ సీఐడీనే. ఒకటీ అరా క్లూలను పట్టుకుని, కేసును సాక్ష్యాధారాలతో నిరూపించడం ఈ విభాగం ప్రత్యేకత. ఇప్పుడు ఇలాంటి రోల్ నే వరుణ్ తేజ్ పోషించనున్నాడు. తన తాతయ్య నిజ జీవితంలో చేసిన ఉద్యోగం ఆధారంగనే.. క్రిష్ ఓ ఇంటెలిజెంట్ డ్రామా రాసినట్లు తెలుస్తోంది.

అంటే తన పూర్వీకుల రోల్ నే వరుణ్ తేజ్ తో చేయించబోతున్నాడు డైరెక్టర్. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా యూరోప్, అమెరికాల్లోనే జరగనుంది. పూర్తి స్థాయి థ్రిల్లర్ ని తలపించేలా స్క్రీన్ ప్లే ఉంటుందని తెలుస్తోంది. మరిప్పుడు చెప్పండి.. వరుణ్ తేజ్ మరోసారి ప్రయోగం చేస్తున్నట్లే కదా. మరో విషయం.. కంచెలో వరుణ్ కి జంటగా నటించిన ప్రగ్యా జైస్వాల్.. మరోసారి మెగా హీరోతో ఆఢిపాడనుంది.