Begin typing your search above and press return to search.
నాగ్ క్యారెక్టర్.. అతడి స్ఫూర్తితో
By: Tupaki Desk | 21 Sept 2017 10:43 AM ISTనిన్న ఏఎన్నార్ జయంతి సందర్భంగా రిలీజైన అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘రాజు గారి గది-2’ ట్రైలర్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ట్రైలర్ ఆసక్తికరంగా కట్ చేయడం ద్వారా సినిమాపై అంచనాలు పెంచింది చిత్ర బృందం. ఇందులో నాగార్జున క్యారెక్టర్ కూడా ఆసక్తి రేకెత్తించింది. ఆయన గెటప్ అదీ కూడా ఆకట్టుకున్నాయి. ట్రైలర్లో కంటే సినిమాలో తన పాత్ర మరింత బాగుంటుందని అంటున్నాడు నాగ్. విశేషం ఏంటంటే.. నాగ్ చేసిన మెంటలిస్ట్ పాత్ర ఊహాజనితం కాదట. కేరళకు చెందిన ఓ వ్యక్తిని చూసి ఈ పాత్రను అల్లుకున్నారట. అతడి నేపథ్యంలో మలయాళంలో ఒక సినిమా కూడా వచ్చిందని.. దాని ఆధారంగానే ‘రాజు గారి గది-2 తీశారన్న ప్రచారం కూడా ఉంది.
ఐతే అందులో వాస్తవమెంతో కానీ.. తన పాత్రకు స్ఫూర్తి కేరళకు చెందిన ఆ వ్యక్తే అని.. అతణ్ని తాను నేరుగా కలిశానని నాగార్జున చెప్పడం విశేషం. హైదరాబాద్ వచ్చిన ఆ వ్యక్తి మన మనసులో ఏముందో కళ్లు చూసి చెప్పేస్తాడని.. తనను కలిసినపుడు కళ్లలోకి చూసి నాలుగు పదాలు అనుకోమన్నాడని.. తాను ఆ నాలుగు పదాలు అనుకున్నాక అతను అవేంటో చెప్పేశాడని నాగ్ తెలిపాడు. నేర పరిశోధన విషయంలో పోలీసులకు అతను సాయం చేస్తుంటాడని.. పోలీసులకు అతనెలా సాయపడతాడో అడిగి తెలుసుకున్నానని.. అతడి విషయాలు తనకెంతో ఆసక్తి కలిగించాయని.. అతను ఇంట్లో ఏదైనా పోయినా కూడా కనుక్కుంటాడని.. తనతో మాట్లాడాక అతడి స్ఫూర్తితోనే ‘రాజు గారి గది-2’లో తన పాత్రను మరింత బాగా చేయగలిగానని నాగ్ తెలిపాడు.