Begin typing your search above and press return to search.
RRR టైగర్ ఫైట్.. 300 స్ఫూర్తి నిజమా?
By: Tupaki Desk | 27 Jan 2020 1:30 AM GMTఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ RRR చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. జూలై 30న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు కాబట్టి డెడ్ లైన్ ప్రకారం 25శాతం టాకీ సహా గ్రాఫిక్స్ వర్క్ ఇతర పనుల్ని పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. పెండింగ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. పాన్ ఇండియా మూవీ బాహుబలి స్థాయికి ఏమాత్రం తగ్గకుండా.. విజువల్ వండర్ గా తెరకెక్కించాలన్న పంతంతో రాజమౌళి ఉన్నారట.
స్వాతంత్యోద్యమం నేపథ్యంలో ఇద్దరు వీరులకు సంబంధించిన సినిమా ఇది. చరణ్ .. తారక్ పాత్రల్ని యూనిక్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇక యంగ్ టైగర్ ఏకంగా పెద్ద పులితో ఫైట్ చేసే సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. ఇంతకుముందే తారక్ టైగర్ తో తలపడే సన్నివేశాల్ని బల్గేరియా అడవుల్లో చిత్రీకరించారు. రియల్ గా ఫైట్ చేస్తున్నాడా? అన్నంత అనుభూతి ని కలిగించేలా టైగర్ ఫైట్ సీన్ ని ఆద్యంతం రక్తి కట్టించేలా తెరకెక్కించారని తెలుస్తోంది. దీనికి వీఎఫ్.ఎక్స్ వర్క్ అదనంగా చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఫైట్ కి సంబంధించి ఇప్పటికే లీక్డ్ ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
మరి మూవీలో ఇంతటి కీలకమైన ఫైట్ ని తెరకెక్కించడానికి స్ఫూర్తి ఉందా? అంటే... హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 300 లోని ఓ సీన్ స్ఫూర్తితో తెరకెక్కించారని చెబుతున్నారు. 300లో తోడేలుతో బాల యోధుడి పోరాటం ఎంతో స్ఫూర్తిని రగిలించేలా ఉంటుంది. ఆకలితో ఉన్న తోడేలుతో పోరాడే యుద్ధవీరుడైన బాలకుడి కాన్ఫిడెన్స్ తారక్ ఫైట్ కి స్ఫూర్తి అని తెలుస్తోంది. యుద్ధరంగంలో శత్రువు ఎంత బలమైన వాడు అయినా తెలివైన ఎత్తుగడతో తుదికంటా పోరాడి ఎలా నెగ్గాలి? అన్నదే ఆ సీన్ స్ఫూర్తి. ఇప్పుడు దానికి అడాప్టేషన్ గానే టైగర్ తో తారక్ ఫైట్ సీన్ తీసారని చెప్పుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్.. అంతటి ఉద్రేకం కలిగించగలిగితే క్లాప్స్ పడడం ఖాయం.