Begin typing your search above and press return to search.
ఇన్ స్టా వార్: బన్నీ వర్సెస్ రౌడీ!
By: Tupaki Desk | 29 Oct 2021 5:12 AM GMTసోషల్ మీడియాలో స్టార్ హీరోల నడుమ సైలెంట్ వార్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా వేదికగా ఎప్పటికప్పుడు ఈ వార్ బయటపడుతూనే ఉంది. ఎవరికి ఫాలోయింగ్ అసాధారణం? అనేది ఫ్యాన్స్ లో డిబేటబుల్ ఎలిమెంట్ కావడం.. ఇన్ స్టా పూర్తిగా సెలబ్రిటీ ఫేవరెట్ గా మారిపోవడంతో నెటి జనుల ఫాలోయింగ్ అంతగా ఉంది. అయితే స్టార్ హీరోల ఫాలోవర్స్ సంఖ్య హెచ్చతగ్గులు సహజంగానే ఉంటుంది. ఇంతకుముందు రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ఒకానొక స్టేజ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రికార్డునే బ్రేక్ చేసాడు. ప్రస్తుతం ఇరువురి నడుమా ఇన్ స్టా వార్ నువ్వా? నేనా? అన్న రేంజ్ లో సాగుతోంది.
ప్రస్తుతం సౌత్ హీరోలందరిలో ఎక్కువగా ఫాలో వర్స్ కలిగి ఉన్న ఏకైక స్టార్ గా విజయ్ దేవరకొండ నిలిచాడు. ఆయన ఫాలోవర్స్ సంఖ్య 13.5 మిలియన్లు ఉంది. దీంతో ఇన్ స్టా లో నెంబర్ వన్ సెలబ్రిటీగా రౌడీస్టార్ ఖ్యాతి కెక్కాడు. ఆ తర్వాత రెండవ స్థానంలో స్టైలిష్ స్టార్ నిలిచారు. ఆయనకు ఇన్ స్టాలో 13.4 మిలియన్ మంది అనుచరులు ఉన్నారు. దీంతో బన్నీ-విజయ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్.. భారీ అభిమానగణం ఉండి బన్నీ 1.4 మిలియన్లు కలిగి ఉంటే చాలా తక్కువ సమయంలో విజయ్ 13.5 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉండటం విశేషం. `అర్జున్ రెడ్డి` చిత్రంతో విజయ్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత `గీతగోవిందం` లాంటి ప్యామిలీ ఎంటర్ టైనర్ సక్సెస్ అవ్వడం అటుపై కొన్ని సినిమాలు ఫెయిలైనా విజయ్ ఇమేజ్ పై అంతగా ప్రభావం పడలేదు. ఇక బన్నీ `పుష్ప` సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే గనుక అతని క్రేజ్ పదింతలు అవ్వడం ఖాయం. హిందీ బెల్ట్ లోనూ అతడికి మరింత ఫాలోయింగ్ పెరుగుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం బన్నీ ఫోకస్ ఆ దిశగానే సాగుతోంది.
ఇక సోషల్ మీడియా వార్ గురించి వస్తే... హీరోల మధ్య ఫాలోయింగ్ పోటీ అభిమానుల మధ్య వార్ కి ఘర్షణలకు దారి తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా మా హీరో అంటే మాహీరో అంటూ గొప్పలు చెప్పుకుని వ్యక్తిగత దూషణలకు దిగిన అభిమానులు చాలా మంది ఉన్నారు. టాలీవుడ్ లో ఈ వివాదాలు అంత పీక్స్ లో లేకపోయినా కోలీవుడ్ లో ఈ తరహా వివాదాలు తరుచూ చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత దూషణలతో అటుపై సైబర్ క్రైమ్ ఫిర్యాదుల వరకూ వెళుతోంది. ఇలాంటివి చాలా కేసులే ఉన్నాయి. వీటిపై హీరోలు సంయమనం పాటించాలని ఎప్పటికప్పుడు చెబుతున్నా! ఆ మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయి. అన్నీ గాలికి కొట్టుకుపోతున్నాయి.