Begin typing your search above and press return to search.
ఇంటెలిజెంట్ కు టార్గెట్ గట్టిదే!!
By: Tupaki Desk | 9 Feb 2018 4:41 AM GMTసాయి ధరం తేజ్ మూవీ ఇంటెలిజెంట్ మూవీ రిలీజ్ ఇవాళే. మాస్ దర్శకుడు వివి వినాయక్ రూపొందించిన ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఒకవైపు మెగాహీరో వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నా.. ఖైదీ నంబర్ 150 తర్వాత వినాయక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగానే ఇంటెలిజెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం 6 కోట్లు.. వైజాగ్ 3 కోట్లు.. ఈస్ట్ 2.2 కోట్లు.. వెస్ట్ 1.8 కోట్లు.. కృష్ణా 2.1 కోట్లు.. గుంటూరు 2.7 కోట్లు.. నెల్లూరు 1.2 కోట్లు.. సీడెడ్ 5.4 కోట్లకు థియేట్రికల్ రైట్స్ విక్రయించగా.. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 24.4 కోట్లకు రైట్స్ సేల్ చేశారు. కర్నాటక 1 కోటి.. రెస్టాఫ్ ఇండియా 30 లక్షలు.. ఓవర్సీస్ 1.3 కోట్లు.. మొత్తం కలుపుకుంటే.. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ లెక్క 27 కోట్లకు చేరుకుంది. సాయిధరం తేజ్ గత హిట్స్ తో పోల్చితే ఈ బిజినెస్ సాధారణమే కానీ.. ప్రస్తుతం ఈ హీరో ఫామ్ దృష్ట్యా ఇది పెద్ద టార్గెట్ అనాల్సిందే.
ఇంటెలిజెంట్ ను బ్లాక్ బస్టర్ కేటగిరీలో చేర్చాలంటే మినిమమ్ 40 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. మాస్ ను మెప్పించగల సమర్ధుడైన డైరెక్టర్ వివి వినాయక్ కారణంగానే ఈ స్థాయి బిజినెస్ జరిగిందని ట్రేడ్ జనాలు అంటున్నారు. అయితే.. పోటీ కూడా బాగా ఉండడంతో.. తేజు ఈ చిత్రాన్ని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లడం కాస్త టఫ్ టార్గెట్ అంటున్నారు.