Begin typing your search above and press return to search.

#MAAelection: నరేశ్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర వాగ్వాదం

By:  Tupaki Desk   |   10 Oct 2021 7:52 AM GMT
#MAAelection: నరేశ్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర వాగ్వాదం
X
'మా' ఎన్నికలు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిట్స్ లోని పబ్లిక్ స్కూల్ లో 8గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ‘మా’ ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

పవన్ తర్వాత వరుసగా చిరంజీవి, రాంచరణ్, బాలక్రిష్ణ, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈరోజు మా ఎన్నికల పోలింగ్ లో భాగంగా నటుడు నరేశ్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎవరూ ఊహించని విధంగా మా సభ్యులు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ వాగ్వివాదం నేపథ్యంలోనే సీనియర్ నటుడు నరేశ్, ప్రకాష్ రాజ్ మధ్య కూడా గొడవ జరిగింది.దాదాపుగా నరేశ్, ప్రకాష్ రాజ్ లు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ కొట్టుకోవడానికి రెడీ అయ్యారు.

ఉదయం మంచు విష్ణు, ప్రకాష్ రాజులు హగ్ చేసుకొని సామరస్యంగానే కనిపించారు.నరేశ్ కూడా అక్కడే పక్కనే ఉండి నవ్వులు చిందించారు. తాజాగా ఇద్దరూ బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సంచలనమైంది. ఇదంతా చూసిన వాళ్లు మా ఎన్నికలు జనరల్ ఎన్నికలను తలపిస్తున్నాయని కామెంట్స్ చేశారు.

ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సంబంధించి రిగ్గింగ్ పాల్పడుతున్నారని మంచు విష్ణు వర్గం ఆరోపిస్తున్నారు. ఒక వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు కూడా. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వారిద్దరికి సర్దిచెప్పి పోలింగ్ సజావుగా సాగేలా అధికారులు చూశారు.