Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: స‌్టార్లు కులాంతర పెళ్లిల్లు
By: Tupaki Desk | 29 Oct 2018 2:30 PM GMTపరిశ్రమలో కులాంతర వివాహాలు ఆల్వేస్ హాట్ టాపిక్. మనిషి మేధోతనంలో సాంకేతికతలో అంత ఎత్తుకు ఎదిగాడు. ఇంకా పెళ్లిళ్లకు కులం అడ్డొస్తుందా? అంటే అదేమీ అడ్డంకి కానేకాదని టాలీవుడ్ లో నిరూపణ అయ్యింది. ఇరు కుటుంబాల నడుమ మంచి సత్సంబంధాలు.. యువతీయువకుల మధ్య ప్రేమాయణం కులాంతర వివాహాలను ప్రోత్సహించడం అన్నివేళలా ఆదర్శం అనిపించుకుంది.
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అపోలో గ్రూప్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం చర్చకొచ్చింది. ఇరు కుటుంబాల సామాజిక వర్గాలు వేరు అయినా ఆదర్శంగా కలిసిపోవడం పలుమార్లు మీడియాలో చర్చకొచ్చింది. అలాగే అగ్రనిర్మాత అల్లు అరవింద్ వారసుడు అల్లు అర్జున్ .. నగరంలో ప్రముఖ బిజినెస్ మేన్ కుమార్తె స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి అయాన్ - అర్హ అనే ఇద్దరు సంతానం. మంచు విష్ణు దివంగత నాయకుడు - మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కజిన్ వెరోనికను పెళ్లాడారు. వీరికి కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. విష్ణు సోదరుడు మంచు మనోజ్ తన వదిన వెరోనికా రెడ్డి స్నేహితురాలు ప్రణతిరెడ్డిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. అంతే కాదు.. మంచు లక్ష్మి ప్రసన్న భర్త అండీ సామాజిక వర్గం వేరు అని చెబుతారు. కులాల్ని పట్టించుకుంటే సెలబ్రిటీ పెళ్లి వ్యవహారాలు కుదిరేవా? ప్రేమించుకున్నారు.. కుటుంబంలో పెద్దల్ని ఒప్పించారు. వివాహం చేసుకుని ఇరు కుటుంబాల మధ్య మంచి బాంధవ్యం పెరిగేందుకు దోహదపడ్డారు.
కులం కోసం కోసేసుకుంటున్న రోజుల్లో మరోసారి సెలబ్రిటీల కులాంతర వివాహాలు హాట్ డిబేట్ గా మారాయి. ఇటీవలి కాలంలో కులాంతర వివాహాలు.. కులం గొడవలు మరోసారి మీడియాలో హైలైట్ అవుతున్నాయి. కులాల్ని పట్టించుకునేది ప్రేమ అవుతుందా? కులంతో ఉండేది పెద్దరికం అనిపించుకుంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది ఆయా సందర్భాల్లో. కులాల కొట్లాటకు విరుద్ధమైన ఆదర్శమైన ఆలోచనలు నేటి సమాజానికి అవసరం. సెలబ్రిటీలైనా - సామాన్యులైనా ఉన్నతిని - మంచి బాంధవ్యాన్ని కోరుకోవాలన్నదే యూనివర్శల్ భావన.