Begin typing your search above and press return to search.
ఇంట్రెస్టింగ్ కామెంట్స్: అల్లు అర్జున్ ఒక్కడే సూపర్ స్టార్..!
By: Tupaki Desk | 7 Dec 2021 6:34 AM GMTఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ''పుష్ప: ది రైజ్''. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో లేటెస్టుగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను లాంచ్ చేసింది.
తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదలైన 'పుష్ప' పార్ట్-1 ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అటవీ నేపథ్యంలో యాక్షన్ సీన్స్ - మెయిన్ క్యాస్టింగ్ పాత్రల తీరుతెన్నులు ఒక రా అండ్ రస్టిక్ ఫిల్మ్ ని సూచిస్తున్నాయి.
ఇక ఊర మాస్ పుష్పరాజ్ అవతారంలో అల్లు అర్జున్ విశ్వరూపం చూపించేశారు. 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా.. ఫైరు..' అంటూ చిత్తూరు యాసలో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇన్నాళ్లూ స్టైలిష్ మేకవర్ తో సినిమాలు చేస్తూ వచ్చిన బన్నీ.. పూర్తిగా భిన్నమైన డీగ్లామర్ పాత్రలో అదరగొట్టేసాడని తెలుస్తుంది.
ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్న 'పుష్ప: ది రైజ్' ట్రైలర్ చూసిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. బన్నీ ని ఉద్దేశిస్తూ ట్విట్టర్ లో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రియలిస్టిక్ క్యారెక్టర్లలో నటించడానికి భయపడని సూపర్ స్టార్ ఒక్క అల్లు అర్జున్ మాత్రమే అని ఆర్జీవీ అభిప్రాయ పడ్డారు.
అంతేకాదు అలాంటి పాత్రలు చేయగలరా అని పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - చిరంజీవి - రజినీకాంత్ వంటి ఇతర హీరోలను ఛాలెంజ్ చేశారు వర్మ. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ ని ఆర్జీవీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఎప్పుడూ ఏదొక విషయంపై వివాదం రేపే వర్మ.. ఇప్పుడు 'పుష్ప' ట్రైలర్ నేపథ్యంలో బన్నీ ని పొగుడుతూ మిగతా హీరోలను టార్గెట్ చేసారని తెలుస్తోంది.
ఏదేమైనా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న 'పుష్ప'.. అల్లు అర్జున్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాతో నేషనల్ వైడ్ సత్తా చాటి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు.
కాగా, 'పుష్ప: ది రైజ్' చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఫాహద్ ఫాజిల్ - సునీల్ - రావు రమేష్ - అనసూయ - ధనుంజయ - అజయ్ ఘోష్ - అజయ్ - శత్రు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఓ స్పెషల్ సాంగ్ లో కనువిందు చేయనుంది.
'పుష్ప' చిత్రాన్ని ముత్యంశెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ట్రైలర్ తో మాస్ ఫెస్టివల్ ని స్టార్ట్ చేసిన మేకర్స్.. రాబోయే రోజుల్లో అగ్రెసివ్ ప్రమోషన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.