Begin typing your search above and press return to search.
నెపోటిజంపై చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
By: Tupaki Desk | 22 Aug 2022 11:30 PM GMTనెపోటిజం.. సినిమా ఇండస్ట్రీలో వారసత్వం... ఈ విషయం గురించి బాలీవుడ్ లో ఈ మధ్య ఎక్కువ చర్చ జరుగుతోంది. బాలీవుడ్ లో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. ఆ స్టార్ కిడ్స్ వల్ల ప్రతిభ ఉన్న వారికి ఆఫర్లు రావడం లేదు అనేది కంగనా వంటి వారి అసంతృప్తి. ఎంతగా నెపోటిజం గురించి ప్రచారం జరుగుతున్నా కూడా బాలీవుడ్ లో ప్రతి ఏడాది పదుల కొద్ది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు.
కేవలం బాలీవుడ్లో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇతర సినిమా పరిశ్రమల్లో కూడా వారసత్వం ఉంది. కాని ఎక్కువగా నెపోటిజం గురించిన టాక్ మాత్రం బాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇండస్ట్రీ ఏదైనా కూడా స్టార్ కిడ్ లు ఎంతమంది వచ్చినా కూడా స్టార్స్ గా నిలిచేది మాత్రం కొద్ది మందే అనే విషయం గుర్తించాలి. ఇండస్ట్రీ లో ఎంట్రీకి వారసత్వం అనేది ఉపయోగపడుతుంది కాని స్టార్స్ గా నిలవడానికి మాత్రం అది ఉపయోగపడదు అనేది అందరి అభిప్రాయం.
తాజాగా నాగ చైతన్య కు నెపోటిజం ప్రశ్న ఎదురయ్యింది. మీడియా సమావేశంలో ఆయన నెపోటిజం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌత్ లో ఇది ఎక్కువగా ఉండదు. ఇది ఎక్కడ ఎలా ప్రారంభం అయ్యిందో నాకు అర్థం కాదు.
నా చిన్నప్పటి నుండి కూడా మా తాత గారి నటన చూస్తూ పెరిగాను. మా నాన్న గారి సినిమాలను చూశాను. వారిద్దరి నుండి స్ఫూర్తి పొంది నేను సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాను.
ఏదైనా సందర్భంలో ఒకే రోజు నేను నటించిన సినిమా మరియు సెల్ఫ్ మేడ్ స్టార్ సినిమా విడుదల అయ్యి.. వారి సినిమా రూ.100 కోట్లు సాధించి నా సినిమా రూ.10 కోట్లు సాధిస్తే అంతా కూడా ఆ హీరో గురించి మాట్లాడుతారు. అందరూ కూడా ఆ హీరోనే ప్రశంసిస్తారు.. తదుపరి ఆఫర్లు ఆ హీరోకే ఎక్కువగా వస్తాయి.. అంతే తప్ప స్టార్ కిడ్ అయినంత మాత్రాన నన్ను ఆధరించరు అన్నట్లుగా చైతూ చెప్పుకొచ్చాడు.
సినిమా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలో అడుగు పెట్టడం వల్ల బ్రేక్ అనేది ఈజీగా లభిస్తుందని చైతూ పేర్కొన్నాడు. సినిమా ఇండస్ట్రీలో పోటీ అనేది అందరికీ సమానం అన్నట్లుగా చైతూ అన్నాడు. ఇప్పుడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో యొక్క కొడుకు భవిష్యత్తులో హీరో అవుతాను అంటే వద్దు అంటాడా అంటూ నాగ చైతన్య ఆసక్తికర కామెంట్స్ చేశాడు.