Begin typing your search above and press return to search.

మంచు వారి అమ్మాయి అందుకే ఆన్ లైన్ క్లాసెస్ ని సపోర్ట్ చేస్తోందా...?

By:  Tupaki Desk   |   11 Jun 2020 1:00 PM GMT
మంచు వారి అమ్మాయి అందుకే ఆన్ లైన్ క్లాసెస్ ని సపోర్ట్ చేస్తోందా...?
X
దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత రెండున్నర నెలలుగా స్కూల్స్ కాలేజెస్ ఇతర విద్యాసంస్థలు అన్నీ మూత పడ్డాయి. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ వస్తున్నా ప్రభుత్వాలు విద్యా సంస్థల రీ ఓపెనింగ్ పై ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు. స్కూల్స్ పునఃప్రారంభం అయితే కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిచే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వాలు విద్యా సంస్థల విషయంలో వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు కొన్ని పరీక్షలు కూడా అవసరం లేదని క్యాన్సిల్ చేయగా మరికొన్నిటిని వాయిదా వేశారు. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. పరిస్థితులను బట్టి ఇక ఇప్పట్లో స్కూల్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదని భావించిన కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. అయితే వీటిపై చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఇప్పటికే కేరళలో ఒక బాలిక ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అయ్యే ఫెసిలిటీ లేక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మరో చోట ఇంకో బాలిక తన పెంకుటిల్లు మీదకి ఎక్కి కష్టసాధ్యంగా ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అయింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం 5వ తరగతిలోపు చదువులు చదువుతున్న పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు రద్దు చేసింది. ఈ విషయంపై సామాజిక అంశాల్ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేసే డైరెక్టర్ క్రిష్ స్పందించారు. ట్విట్టర్ లో ఒక ఆర్టికల్ పై స్పందిస్తూ ''నిజంగా బ్రిలియంట్ న్యూస్.. ఇది నేషనల్ పాలసీ అవుతుందా? అధికమైన ఫీజుతో 2వ తరగతి విద్యార్థి కూడా ఆన్ లైన్ క్లాసులకు హాజరు అవుతున్నాడు అని రీసెంట్ గా విన్నాను'' అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై క్రిష్ ని సమర్థిస్తూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే మంచు లక్ష్మీ మాత్రం ఆయన చేసిన కామెంట్స్ కి కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. క్రిష్ కామెంట్ కి మంచు లక్ష్మీ స్పందిస్తూ.. ''నువ్వొచ్చి ఇప్పుడు క్లాసెస్ చెప్తావా.. కనీసం కొన్ని గంటలైనా వారికి ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి'' అని ట్వీట్ చేసింది. దీనికి క్రిష్ రిప్లై ఇస్తూ ''నేను దీన్ని తప్పనిసరి చేయడానికి వ్యతిరేకం.. తల్లిదండ్రులు ఎప్పుడూ వారి సౌలభ్యం ప్రకారం ఎంచుకోవచ్చు'' అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కి స్పందించిన మంచు లక్ష్మీ మరో కామెంట్ చేసింది. ''పిల్లలకు ఆన్‌ లైన్ క్లాసులు తీసుకోవటానికి ఎవరూ బలవంతం చేయడం లేదు.. ఇంతకంటే మార్గం లేదు.. తీసుకోండి లేదా వదిలేయండి.. పాఠశాలలు కూడా కొత్త మార్గాన్ని గుర్తించడానికి చాలా కష్టపడుతున్నాయి.. ఇక నా కూతురు ఐప్యాడ్ ముందు గంటల తరబడి చూడటం నా హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది'' అని మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ట్వీట్ల కన్వర్జేషన్ వైరల్ గా మారింది. అయితే మంచు లక్ష్మీ ట్వీట్స్ పై నెటిజన్స్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. 'మంచు ఫ్యామిలీ చాలా స్కూల్స్ కాలేజెస్ నడుపుతున్నారు.. అందువల్ల మంచు వారి అమ్మాయి అలా రియాక్ట్ అవుతోంది' అని విమర్శిస్తున్నారు. 'నీ బిజినెస్ దెబ్బ తింటుందని స్కూల్ ఇళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ని సమర్ధిస్తున్నావ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ''మంచు అక్కకి ప్రైవేట్ బడి ఉంది. దానికి కాసులు కావాలి. అలా జరగాలి అంటే ఆన్లైన్ క్లాసెస్ జరగాలి' అంటూ రిప్లై ఇస్తున్నారు నెటిజన్స్.