Begin typing your search above and press return to search.
రాజమౌళి క్రేజీ సీక్వెల్స్ పై ఆసక్తికర చర్చ!
By: Tupaki Desk | 6 Nov 2022 12:30 AM GMT'బాహుబలి' వంటి సంచలన సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమాకు గుర్తింపుని తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి. ఇదే సినిమా తరువాత టాలీవుడ్ సినిమాల మార్కెట్, బిజినెస్ స్థాయి ఊహించని విధంగా పెరిగింది. ఉత్తరాది వారు మన సినిమాలకు బ్రహ్మరథం పట్టేలా చేసింది. అంతే కాకుండా తెలుగులో సినిమా అంటే భారీ స్థాయిలో డబ్బింగ్ హక్కుల్ని సొంతం చేసుకుంటూ భారీ మొత్తాలని హిందీ డబ్బింగ్ ప్రొడ్యూసర్స్ పోటీపడుతున్నారు.
ఇలా పలు రకాలుగా తెలుగు సినిమాకు ఆదాయమార్గాలని, మార్కెట్ స్థాయిని పెంచేసిన రాజమౌళి రీసెంట్ గా మరో పాన్ ఇండియా వండర్ ని అందించిన విషయం తెలిసిందే. ఇద్దరు సూపర్ స్టార్ లు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కలయికలో భారీ మల్టీస్టారర్ మూవీగా 'RRR' ని తెరకెక్కించి ఔరా అనిపించారు. ఈ సినిమాతో మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటో యావత్ ప్రపంచ సినిమాకు చూపించి అబ్బుర పరిచారు. ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నేపథ్యంలో ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్ల ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
వసూళ్ల పరంగానూ రికార్డులు తిరగరాసింది. అయితే ఓటీటీలో రిలీజ్ అయిన తరువాతే ఈ మూవీకి హాలీవుడ్ స్టార్స్, టెక్నీషియన్స్, విదేశీ ప్రేక్షకులు ఫిదా కావడం మొదలైంది. హాలీవుడ్ స్టార్స్, టెక్నీషియన్స్ సినిమాపై ప్రశంసల వర్సం కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దీంతో ఈ మూవీకి ఇంత వరకు ఏ భారతీయ సినిమాకు తగ్గని ప్రయారం..పాపులారిటీ దక్కాయి.
ఈ నేపథ్యంలో ఈ మూవీని ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలపాలని గత కొన్ని రోజులుగా లాబీయింగ్ చేస్తూ రాజమౌళి అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుంటూ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అంతే కాకుండా ఇటీవల జపాన్ లోనూ ఈ మూవీని భారీ స్థాయిలో అత్యధిక సిటీస్ లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో పలు మీడియా హౌస్ లతో ముచ్చటించిన రాజమౌళి 'RRR' సీక్వెల్ పై స్పందించారు.
సీక్వెల్ కోసం పలు ఆసక్తికరమైన ఆలోచనలు వున్నాయని వెల్లడించిన రాజమౌళి అదే స్థాయిలో 'బాహుబలి 3' గురించి కూడా ఆ మధ్య పాజిబులిటీ వుందంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు సీక్వెల్ లో ఏది పాజిబుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. 'RRR' తో పోలిస్తే 'బాహుబలి' సీరీస్ దేశ వ్యాప్తంగా రాజమౌళికి భారీ క్రేజ్ ని తీసుకురావడమే కాకుండా ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక ఆసక్తిని క్రియేట్ చేసింది. అయితే 'RRR' తరహాలో మాత్రం విదేశీ ప్రేక్షకుల ప్రశంసల్ని సొంతం చేసుకోలేకపోయింది.
'RRR' కు లభిస్తున్న ఆదరణ..ఈ మూవీపై వరల్డ్ సినిమాలో జరుగుతున్న చర్చని దృష్టిలో పెట్టుకుని 'RRR' కు సీక్వెల్ చేస్తే అది మరో లెవెల్లో వుండే అవకాశం వుందని, దీనికే ఇప్పడు ఎక్కువగా స్కోప్ వుందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. మరి రాజమౌళి మైండ్ లో ఏ ముందో..తను దేనికి సీక్వెల్ చేయాలనుకుంటున్నాడో తెలియాలంటే తను ఓపెన్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.