Begin typing your search above and press return to search.

ఈ వారం రాబోయే ఆసక్తికరమైన ఓటీటీ కంటెంట్

By:  Tupaki Desk   |   18 Jan 2023 9:30 AM GMT
ఈ వారం రాబోయే ఆసక్తికరమైన ఓటీటీ కంటెంట్
X
సంక్రాంతి సినిమా పండుగ పూర్తయింది. సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కళ్యాణం కమనీయం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ టార్గెట్ గా ఈ మూవీని తెరకెక్కించడంతో చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేశారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని 100 కోట్ల క్లబ్లో చేరిపోయాయి. అలాగే తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారసుడు, తెగింపు సినిమాలకి యావరేజ్ టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే వచ్చేవారం కూడా పఠాన్, హంట్, తుపాకులగూడెం సినిమాలు థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఇక డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అమెజాన్ నెట్ ఫ్లిక్స్, సోనీ, ఆహా, హాట్ స్టార్ లాంటి ఓటీటీ చానల్స్ కూడా పోటీపడి డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకులు ముందుకి తీసుకొని వస్తున్నాయి. కొత్తదనం కోరుకుంటున్న ప్రేక్షకుల కోసం థ్రిల్లర్ జోనర్లు కథలను అందించే ప్రయత్నం చేస్తున్నాయి.

అలాగే కొన్ని సినిమాలను నేరుగా డిజిటల్ మాధ్యమాల ద్వారా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఈ వారం ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి చూసుకుంటే చాలా ఉన్నాయని చెప్పాలి.

హిందీలో రష్మిక మందన నటించిన రెండో సినిమా మిషన్ మజ్ను జనవరి 20న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే రవితేజ సూపర్ హిట్ మూవీ ధమాకా కూడా జనవరి 22న నెట్ఫ్లిక్స్ లోనే ప్రసారానికి రెడీ అవుతుంది. దాంతో మలయాళం మూవీ కాప జనవరి 19న రిలీజ్ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అంజలి నటించిన ఝాన్సీ సీజన్ 2 వెబ్ సిరీస్ జనవరి 19 నుంచి టెలికాస్ట్ కాబోతుంది.

ఆహాలో ఐశ్వర్య రాజేష్ నటించిన బై లింగ్వల్ మూవీ డ్రైవర్ జమున జనవరి 20న రిలీజ్ కాబోతుంది. ఇక జీ5లో చత్రివలి వెబ్ సిరీస్ జనవరి 20న టెలికాస్ట్ కాబోతుండగా, తెలుగు బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ నటించిన ఏటీఎం వెబ్ సిరీస్ కూడా అదే రోజు టెలికాస్ట్ కాబోతుంది. మరి ఇవి ప్రేక్షకులను ఏ మేరకు రంజింపచేస్తాయి అనేది వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.