Begin typing your search above and press return to search.
తెలుగు నెత్తురు వేడి దేశమంతా తెలియాలి
By: Tupaki Desk | 6 Jan 2019 11:36 AM GMTనందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించి.. నటించిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ బయోపిక్ కావడం పైగా.. బాలయ్యకు సంక్రాంతి సీజన్లో సూపర్ ట్రాక్ రికార్డ్ ఉండడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ అంచనాలు మరింత పెంచేలా ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ మరో ప్రోమోను విడుదల చేశారు.
ఈ వీడియోలో 'ఏ ఆంధ్రా..తమిళనాడు క్యా హై జీ.. సభీ సౌత్ ఇండియన్ హైనా" అని ఒకరంటే దానికి సమాధానంగా బాలయ్య "హమ్ ఆంధ్రా సే హై. హమ్ కో భీ ఏక్ వ్యక్తిత్వ్ హై.. సమ్మాన్ హై. సంస్కృతి హై.. సభీ మద్రాసి కైసే హోతే హై" అంటూ పవర్ఫుల్ డైలాగ్ చెప్తాడు. మరో సీన్లో ఎఎన్నార్ పాత్రలో సుమంత్ ఎన్టీఆర్ పాత్రధారి బాలయ్యతో "నేను హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది ఎందుకనుకుంటున్నావు. ఇలాంటి మాటలు వినకూడదనే.. నువ్వు కూడా వచ్చేయ్యొచ్చు కదా?" అంటాడు. దానికి సమాధానంగా "ఇదొక ఇండస్ట్రీ సమస్య కాదు. తెలుగు జాతి సమస్య. తెలుగు భాష వాడి తెలుగు నెత్తురు వేడి దేశమంతా తెలియాలి. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన ఎన్టీఆర్ ను ఆ దిశగా పురిగొల్పిన సంఘటనలను ఈ రకంగా దర్శకుడు క్రిష్ మనకు చూపించినట్టున్నాడు. ఈ సీన్లు తప్పకుండా అందరినీ మెప్పించేవే.
ఈ ప్రోమో సంగతి ఇలా ఉంటే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ డెబ్యూ గురించి చాలా రోజులుగా చర్చలు సాగుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక క్యామియోద్వారా ఎంట్రీ ఉండొచ్చనే ప్రచారం కూడా జరిగింది. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటిలో లేదని బాలయ్య తేల్చేశారు. ఇక ఎన్టీఆర్ లో మోక్షజ్ఞ నటిస్తాడని అభిమానులు ఆశపడ్డారు కదా అని బాలయ్య వద్ద ప్రస్తావిస్తే.. తన మనసులో అలాంటి ఆలోచన లేదని.. మోక్షజ్జ పై ప్రెజర్ పెట్టదలుచుకోలేదని అన్నాడు. కానీ తన మనవడు ఆర్యవీర్ ఈ సినిమాలో నటించాడని.. ఏడు నెలల వయసే అయినా సెట్లో కంగారు పడకుండా ఏడవకుండా తన ముత్తాత స్థాయిలోనటించాడని మురిపెంగా చెప్పాడు