Begin typing your search above and press return to search.
`బంగార్రాజు` వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ
By: Tupaki Desk | 10 Jan 2022 4:51 PM GMTహాలీవుడ్ లో ఒక సినిమా తీయాలంటే స్క్రిప్ట్ దానికి సంబంధించిన లొకేషన్స్, సీజీ వర్క్ కోసం ఏళ్లు పడుతూ వుంటుంది. అంతా సిద్ధమయ్యాక మూవీ షూటింగ్ ని పక్కా ప్లాన్ ప్రకారం తక్కువ టైమ్ లోనే పూర్తి చేస్తుంటారు. ఇక కొన్ని చిత్రాల నిర్మాణానికి ఎంత ప్లాన్ చేసుకున్నా ఏళ్లు పడుతూ వుంటుంది. మన తెలుగులోనూ కొన్ని చిత్రాల కథలకు నెలలు పడితే దాన్ని పూర్తి చేయడానికి రెండు మూడేళ్లు పడుతోంది. `బాహుబలి`, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు ఇదే తరహాలో మూడేళ్లు పట్టిన విషయం తెలిసిందే.
అయితే ఇందుకు పూర్తి భిన్నంగా `బంగార్రాజు`షూటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి తాజాగా బయటికి వచ్చింది. ఈ చిత్ర కథ కోసం ఏళ్లు పడితే తీయడానికి కేవలం నెలలు మాత్రమే పట్టింది. వివరాల్లోకి వెళితే.. 2016లో సంక్రాంతి కి `సోగ్గాడే చిన్నినాయన` విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. ఈ మూవీ విడుదలై దాదాపు ఐదేళ్లవుతోంది. అంటే అప్పుడే `బంగార్రాజు`కు బేసిక్ ఐడియాని అనుకున్నారు.
అంతే కాకుండా ప్రీక్వెల్ ని వీలైనంత త్వరలోనే చేయానలని అనుకున్నారు కూడా. అదే ఏడాది `బంగార్రాజు` గురించి ప్రకటించారు కూడా. కానీ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పక్కాగా రాకపోవడంతో ప్రతీ ఏడాదీ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ మూవీ సెట్స్ పైకి రావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. ఈ చిత్ర కథ రాస్తూనే దర్శకుడు కల్యాణ్ కృష్ణ ... నాగచైతన్యతో `రారండోయ్ వేడుక చూద్దాం`, రవితేజతో `నేలటిక్కెట్టు` చిత్రాలు చేశారు.
సీనియర్ రైటర్ సత్యానంద్ వెర్షన్ లమీద వెర్షన్ లు మార్చి మార్చి రాస్తే కానీ `బంగార్రాజు` ఫైనల్ డ్రాప్ట్ సిద్ధం కాలేదు. ఫైనల్ డ్రాప్ట్ సంతృప్తికరంగా వుండటంతో గత ఏడాదే నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఇలా స్క్రిప్ట్ కే ఐదేళ్ల సమయం పడితే సినిమా పూర్తి చేయడానికి కేవలం నాలుగంటే నాలుగు నెలల సమయం పట్టడం విశేషం.
గత ఏడాది జూలైలో షూటింగ్ మొదలుపెట్టిన చిత్ర బృందం డిసెంబర్ కి పూర్తి చేశారు. ఇక షూటింగ్ ని రాకెట్ స్పీడుతో పూర్తి చేసినట్టే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫినిష్ చేసి ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే జనవరి 14న విడుదల చేస్తున్నారు. కథ కోసం ఐదేళ్లు శ్రమించిన టీమ్.. సినిమా షూటింగ్ కి కేవలం నాలుగు నెలలు తీసుకోవడంతో క్వాలిటీగా తీశారా..? .. ఇన్నేళ్లు కష్టపడి వండిన కథలో ఏ మాత్రం మెరుపులున్నాయి... ఎలాంటి ప్రత్యేకతలున్నాయా? అని అంతా ఆరాతీస్తున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు మాత్రం ఈ సీజన్ `బంగార్రాజు`దే సెలబ్రేషన్స్ కి రెడీ అయిపోతున్నారు.