Begin typing your search above and press return to search.

తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’

By:  Tupaki Desk   |   21 Aug 2020 5:00 AM GMT
తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’
X
కన్నడ హిట్‌ చిత్రం ‘లవ్‌ మోక్‌ టైల్‌’ ను తెలుగులో సత్యదేవ్‌ హీరోగా తమన్నా హీరోయిన్‌ గా రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగ శేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్‌ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ నెల చివరి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమాను ఇదే ఏడాది చివరి వరకు థియేటర్స్‌ లో లేదంటే ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాకు విభిన్నమైన టైటిల్‌ ను పరిశీలిస్తున్నారు.

‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్‌ ను ఈ సినిమాకు ఖరారు చేసే యోచనలో యూనిట్‌ సభ్యులు ఉన్నారు. రెండు మూడు సంవత్సరాల క్రితం నితిన్‌ హీరోగా తెరకెక్కిన ఒక సినిమాకు దీనిని టైటిల్‌ గా అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల మరో టైటిల్‌ తో సినిమా విడుదల చేశారు. ఇప్పుడు మళ్లీ సత్యదేవ్‌ తమన్నా సినిమాకు ఈ టైటిల్‌ ను అనుకుంటున్నారు. టైటిల్‌ తో సినిమా గురించి ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్‌ కలిగించే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్‌ ఖరారు చేయాలనుకుంటున్నారట.

మిల్కీ బ్యూటీ ఈమద్య కాలంలో ఆఫర్లు కాస్త తగ్గడంతో ఓటీటీ కంటెంట్‌ పై ఆసక్తి చూపిస్తుంది. ఈ సమయంలోనే హీరోయిన్‌ కు ప్రముఖ పాత్ర ఉండే లవ్‌ మోక్‌ టైల్‌ రీమేక్‌ తో మేకర్స్‌ సంప్రదించగా సత్యదేవ్‌ తో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సత్యదేవ్‌ మరో విభిన్నమైన రోల్‌ లో కనిపించబోతున్నాడు.