Begin typing your search above and press return to search.
ఇస్మార్ట్ ట్విస్ట్.. షేక్ చేస్తుందని అంటున్నారే!
By: Tupaki Desk | 16 Feb 2019 4:55 AM GMTపూరి జగన్నాధ్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. దాదాపుగా టాలీవుడ్లో ఉన్న అందరూ స్టార్లతో సినిమాలు చేసి సూపర్ హిట్లిచ్చిన పూరి గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తన స్థాయికి తగ్గ సినిమా తీయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆయన ఎనర్జిటిక్ హీరో రామ్ తో 'ఇస్మార్ట్ శంకర్' టైటిల్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా పూరికి పూర్వవైభవాన్ని తీసుకొస్తుందా?
పూరి అయితే ఈ సినిమాతో ఇస్మార్ట్ హిట్ కొడతానని చాలా నమ్మకంగా ఉన్నారట. దానికి రెండు మూడు కారణాలు ఉన్నాయట. నిజానికి ఈ సినిమా కథ తయారు చేసింది ఆకాష్ పూరి కోసమట. కానీ పూరి సన్నిహితులు కథ విన్నతర్వాత ఈ ఆకాష్ లాంటి కొత్త హీరో కంటే ఈ కథకు నటనలో అనుభవం ఉన్న పాపులర్ హీరోను తీసుకుంటే బాగుంటుందని సూచించారట. అందుకే రామ్ ను ఎంచుకున్నారని.. రామ్ కూడా కథ విన్న తర్వాత ఫుల్ గా ఇంప్రెస్ కావడంతో అప్పటికే ఫైనల్ చేసిన వేరే ప్రాజెక్టును పక్కన పెట్టి మరీ ఈ సినిమాకు ఒకే చెప్పాడట. ఈ సినిమాలో రామ్ పాత్రకు తిక్క పీక్స్ లో ఉంటుందని.. పూరి సినిమాల్లో ఈ రేంజ్ క్యారెక్టరైజేషన్ మొదటిసారి అని అంటున్నారు. అంతే కాదు క్లైమాక్స్ లో ట్విస్ట్ అయితే ఆడియన్స్ ను షాక్ కు గురిచేస్తుందట.
ఇవన్నీ నిజమే అయితే పూరి ఖచ్చితంగా దర్శకుడిగా బౌన్స్ బ్యాక్ అవుతారనడంలో సందేహం లేదు. కాకపోతే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం సినిమా రిలీజ్ వరకూ వేచి చూడక తప్పదు.