Begin typing your search above and press return to search.

అందరికి నమస్కారం.. మంచు విష్ణు ఆసక్తికర లేఖ

By:  Tupaki Desk   |   20 July 2022 3:30 PM GMT
అందరికి నమస్కారం.. మంచు విష్ణు ఆసక్తికర లేఖ
X
మంచు విష్ణు ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌ గా వార్తల్లో ఉంటున్నాడు. హీరోగా ఆయన నటిస్తున్న జిన్నా సినిమా విడుదలకు రెడీ అవుతోంది. సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పూత్‌ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా లో మంచు విష్ణు లుక్ మరియు టైటిల్‌ చాలా విభిన్నంగా ఉండటంతో సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

విష్ణు గత చిత్రాల గురించి.. మంచు వారి గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సినిమా ను విభిన్నంగా పబ్లిసిటీ చేయడంలో యూనిట్‌ సభ్యులు సఫలం అయ్యారు. టైటిల్ ను అనౌన్స్ చేయడం మొదలుకుని మొన్నటి ఫస్ట్‌ లుక్ గ్లిమ్స్ విడుదల చేసే వరకు క్రియేటివ్‌ గా ప్రమోట్ చేశాడు.

ఇక జిన్నా సినిమా లో మంచు విష్ణు ఇద్దరు కూతుర్లు అయిన అరియానా.. వివియానా లు ఒక పాటను కలిసి పాడారు. ఆ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఆ పాటను విడుదల చేయబోతున్నట్లుగా మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. పాట విడుదల చేయబోతున్నట్లుగా ఒక ఆసక్తికర లేఖ ను మంచు విష్ణు అభిమానులను ఉద్దేశించి రాశాడు.

అందరికీ నమస్కారం.. అంటూ మంచు విష్ణు తన లేఖ ను ప్రారంభించాడు. తనకు తన కుటుంబం కు ఇంత గౌరవం.. గుర్తింపు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పడం తో పాటు ఇంకా పలు విషయాలను ప్రస్థావిస్తూ మంచు విష్ణు లేఖ కొసాగింది. ఇప్పుడు నా కూతుర్ల ను ఒక తండ్రిగా నటుడిగా మీ ముందుకు తీసుకు రాబోతున్నాను అన్నాడు.

అరియానా.. వివియానా లు గాయనీమణులుగా.. నటీమణులు గా మీ ముందుకు రాబోతున్నారు. నా రాబోయే సినిమా జిన్నా లో అరియానా.. వివినాయనా కలిసి పాట పాడారు.

ఆ పాటకు సంబంధించిన వీడియోను ఈనెల 24వ తారీకున ఆదివారం ఉదయం 11.30 నిమిషాలకు రిలీజ్ చేయబడుతుంది. వాళ్లు నటీమణులు అవ్వాలి అనేది నా కల. కానీ వారు ఏ మార్గం ఎంచుకుంటారో అనేది వారి ఇష్టం. వాళ్ల ఈ ప్రయాణం కు మీ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నాను... మీ విష్ణు మంచు