Begin typing your search above and press return to search.
మహేష్ 29 పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
By: Tupaki Desk | 29 May 2022 11:30 AM GMTసూపర్ స్టార్ మహష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. #మహష్ 29వ చిత్రంగా సెట్స్ పైకి వెళ్తుంది. ఆఫ్రికన్ ఆడవుల నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. ఇండియన్ స్ర్కీన్ పై ఈజానర్ లో సినిమా రావడం ఇదే తొలిసారి. మహేష్ ఇమేజ్...జక్కన్న క్రియేటివీ నడుమ ఎస్ ఎస్ ఎంబీ 29 పాన్ ఇండియాని మించే ఉంటుందని అంచనాలు ఏర్పడుతున్నాయి.
మహేష్ గ్లామర్...ఇమేజ్ ముందు పాన్ ఇండియా మించి పాన్ వరల్డ్ రీచ్ అయ్యేలా జక్కన్న ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి ..స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో కలిసి కథకి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ స్టోరీని ఎన్ని వండర్స్ లో చూపించాలో? అన్ని విధాలుగా హైలైట్ చేసేలా కసరత్తులు చేస్తున్నారు.
ఫస్ట్ క్లాస్ టెక్నిషీయన్లని రంగంలోకి దించుతున్నారు. హాలీవుడ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రాల స్ఫూర్తితో జక్కన్న తనదైన శైలిలో తెలుగు టచ్ అప్ తో తెరకెక్కించనున్నారు. స్ర్కిప్ట్ సహా అన్ని రకాల ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది మిడ్లో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
ఇందులో రెండు బలమైన నెగిటివ్ పాత్రలకి టాప్ స్టార్లని రంగంలోకి దించబోతున్నారుట. ఒక నెగిటివ్ రోల్ కి కోలీవుడ్ స్టార్ హీరో కార్తిని అనుకుంటున్నారుట. విజయేంద్ర ప్రసాద్ రాసిన పాత్రకి కార్తి అయితే పర్పెక్ట్ గా సూటవుతాడని భావిస్తున్నారుట. గతంలో అతను హీరోగా నటించిన 'పరుత్తివీరన్'..'యుగానికి ఒక్కడు' లాంటి చిత్రాల్లో కార్తీ పాత్రలు జక్కన్న అనుకుంటోన్న రోల్ కి బాగా ఉపకరిస్తాయని ద్వయం భావిస్తుందిట.
ఆ పాత్రల ద్వారా కార్తీ ఎక్స్ పీరియన్స్ తో బెస్ట్ అవుట్ ఫుట్ తీసుకొవచ్చన్నది జక్కన్న ప్లాన్ గా కనిపిస్తుంది. సినిమా లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా హీరోకి ధీటుగా ఉంటుందని సమాచారం. ఇక మరో పాత్ర కోసం బాలీవుడ్ హీరో ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారుట. హీరో పేరు బయటకు రాలేదు గానీ..పేరున్న స్టార్ అయితే బాగుంటుందని దర్శక ద్వయం భావిస్తుందిట.
అంటే తమిళ్ నుంచి ఒకర్ని..హిందీ నుంచి మరొకర్ని తీసుకుంటే బిజినెస్ పరంగానూ వర్కౌట్ అవుతుందన్నది మరో ప్లాన్ గానూ తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రూమర్ మహష్ ఫ్యాన్స్ లో ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందుగానే ఇంత ఊపు వస్తుందంటే? సెట్స్ కి వెళ్లిన తర్వాత ఇంకే స్థాయిలో హైప్ వస్తుంది? ఇంకెంత మంది బిగ్ స్టార్స్ సినిమాలో యాడ్ అవుతారు? వంటి అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.