Begin typing your search above and press return to search.
మెగా గాడ్ ఫాదర్ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
By: Tupaki Desk | 6 April 2022 7:42 AM GMTమెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అంటూ గత రెండు సంవత్సరాలుగా ప్రచారం అయితే జరుగుతుంది కాని సినిమాలు రావడం లేదు అంటూ అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. చిరంజీవి జోరు మీదున్న కూడా కరోనా మరియు ఇతరత్రా కారణాల వల్ల సినిమాలు విడుదల కావడం లేదు. ఆచార్య ను ముగించి నెలలు దాటుతున్నా కూడా విడుదల విషయంలో జాప్యం అవుతుంది.
ఆచార్య సినిమా ను ఎట్టకేలకు ఈ నెల చివర్లో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఆచార్య విడుదలకు ముందే మలయాళ మూవీ లూసీఫర్ ను రీమేక్ పూర్తి చేసిన చిరంజీవి ఇదే ఏడాది లో ఆ రీమేక్ ను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మెగా వర్గాల వారు మరియు ఆ సినిమా యూనిట్ సభ్యుల నుండి సమాచారం అందుతోంది.
లూసీఫర్ కు చాలా మార్పులు చేర్పులు చేసి మోహన్ రాజా 'గాడ్ ఫాదర్' అనే సినిమాను చిరంజీవితో చేస్తున్న విషయం తెల్సిందే. నయనతార ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుండగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలకమైన గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇంకా పలువురు ప్రముఖ నటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ మూవీగా ఈ సినిమా రూపొందినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా ను మొదటి నుండి కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అన్నట్లుగానే ఈ సినిమా ను ఇదే ఏడాది ఆగస్టు లో విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఆగస్టు రెండవ వారంలో విడుదల చేయబోతున్నారట. ఆగస్టు 11వ తారీకు లేదా 12వ తారీకు ఈ సినిమాను విడుదల చేయడం వల్ల ఇండిపెండెన్స్ డే సెలవును సద్వినియోగం చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో మెగా కాంపౌండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతర సినిమాలు పెద్దవి ఏవీ కూడా పోటీ లేకుండా కూడా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో ఒకటికి రెండు సార్లు విడుదల తేదీ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.
అదే వారంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసారా అనే సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విడుదల తేదీ విషయంలో ఒకటి రెండు రోజుల మార్పు ఉండే అవకాశాలు లేకపోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బింబి సారా యూనిట్ సభ్యుల తో చర్చించే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.
చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక భోళా శంకర్ సినిమాను 2023 సంవత్సరం ఆరంభంలో అంటే సంక్రాంతి లేదా కాస్త అటు ఇటుగా విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే కాకుండా వచ్చే ఏడాదిలోనే బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరన్న సినిమాను కూడా విడుదల చేస్తారట.
కాలం కలిసి వస్తే వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాను కూడా 2023 లోనే విడుదల చేసినా ఆశ్చర్యం లేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలను విడుదల చేసే విధంగా మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేసుకున్నారు. ఆయన ప్రతి సినిమా పై కూడా అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. కనుక ప్రతి సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.