Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - కొర‌టాల సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   3 Feb 2022 3:30 PM GMT
ఎన్టీఆర్ - కొర‌టాల సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ గ‌త కొన్ని నెల‌లుగా వరుస‌గా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. జ‌న‌వ‌రి 7న రిలీజ్ అన్నారు.. అది మ‌ళ్లీ కోవిడ్ కార‌ణంగానే వాయిదా ప‌డింది. ఆ త‌రువాత మార్చి 18 లేదా ఏప్రిల్ 28 న రిలీజ్ అంటూ రెండు రిలీజ్ డేట్ లు ప్ర‌క‌టించారు. ఫైన‌ల్ గా మార్చి 25నే వ‌చ్చేస్తున్నామ‌ని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో రామ్ చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం వెళ్ల‌గా.. ఎన్టీఆర్ .. కొర‌టాల శివ సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

దాదాపు ఏడాది క్రిత‌మే ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా ఈ మూవీ ప‌ట్టాలెక్క‌నుంది. యువ క‌ళా సుధ‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ ల‌పై సుధాక‌ర్ మిక్కిలినేని, నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్ ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. `జ‌న‌తా గ్యారేజ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత కొర‌టాల శివ - ఎన్టీఆర్ ల క‌ల‌యిక‌లో రానున్న సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే ఈ ప్రాజెక్ట్ పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ ప్రాజెక్ట్ `జ‌న‌తా గ్యారేజ్` కి మించి వుంటుంద‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ వెల్ల‌డించ‌డంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్ప‌డు ప‌ట్టాలెక్కుతుందా? అని ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ మూవీని లాంఛ‌నంగా ప్రారంభించి వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశార‌ని వార్త‌లు వినిపించాయి. ఫిబ్ర‌వ‌రి 7న పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

కానీ తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫిల్మ్ స‌ర్కిల్స్ లో షాకింగ్ న్యూస్ వైర‌ల్ అవుతోంది. త్రివిక్ర‌మ్ - ఎన్టీఆర్ ల ప్రాజెక్ట్ త‌ర‌హాలోనే కొర‌టాల - ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింద‌ని, ఈ మూవీ స్థానంలో మ‌రో చిత్రం ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని ఓ వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఇన్ సైడ్ టాక్ మాత్రం మ‌రోలా వుంది.

కొర‌టాల - ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆగిపోలేద‌ని, అదంతా ఈ మూవీపై జ‌రుగుతున్న త‌ప్పుడు ప్ర‌చారం మాత్ర‌మేన‌ని, త్వ‌ర‌లోనే మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుని లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీని ప్రారంభిస్తార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ త‌రువాత ఎన్టీఆర్ `ఉప్పెన‌` ఫేమ్ బుచ్చిబాబు సాన తో ఓ స్పోర్ట్స్ డ్రామాని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.