Begin typing your search above and press return to search.

షారుక్ ఖాన్ కి అంత‌ర్జాతీయ పుర‌స్కారం?

By:  Tupaki Desk   |   22 Nov 2022 7:30 AM GMT
షారుక్ ఖాన్ కి అంత‌ర్జాతీయ పుర‌స్కారం?
X
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇంట అవార్డులు...రివార్డులు కొత్తేం కాదు. ఆయ‌న ప్ర‌తిభ‌ను..సినీ ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న అందించిన సేవ‌ల‌కు గానూ జాతీయ‌..అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌లు అవార్డులు ద‌క్కించుకున్నారు. న‌టుడిగా ఆయ‌న సేవ‌లు మ‌రింత విస్తృతం చేస్తూ ఖ్యాతిని మ‌రింత పెంచుకుంటున్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ఆయ‌న గుర్తింపు పెరుగుతోంది.

తాజాగా షారుక్ ఖాతాలో మ‌రో అంత‌ర్జాతీయ పుర‌స్కారం చేరింది. రెడ్సీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం పెస్టివ్ ల‌కి షారుక్ ని ఎంపిక చేసిన‌ట్లు చిత్రోత్స‌వాల నిర్వ‌హ‌కులు ప్ర‌క‌టించారు. భార‌తీయ సినిమా రంగానికి షారుక్ సేవ‌ల్ని గుర్తించి అవార్డు ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. సౌదీ అరేబియా జెద్దాలో డిసెంబ‌ర్ లో దీనికి సంబంధించిన వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా అవార్డును అదే వేదిక‌పై షారుక్ కి ప్ర‌దానం చేయ‌నున్నారు. షారుక్ ఖాన్ ని గౌర‌వించ‌డం గొప్ప అదృష్టంగా భావిస్తున్న‌ట్లు నిర్వ‌హ‌కులు వెల్ల‌డించారు. హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న అందించిన సేవ‌ల్నికొనియాడారు.

న‌టుడిగా.. నిర్మాత‌గా ఆయ‌న సేవ‌ల గురించి ప్ర‌త్య‌కంగా ముచ్చ‌టించారు. త‌న న‌ట‌న‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్ని కొన్నేళ్ల‌గా మెప్పిస్తున్నారు.

భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో అత్యంత విజ‌యవంత‌మైన న‌టుల్లో ఆయ‌న ఒక‌రు. డిసెంబ‌ర్ లో సౌదీకి ఆహ్వానించి మాప్రత్యేక అతిధిగా చూసుకుంటామ‌ని సీఈవో తెలిపారు. అలాగే అవార్డు ప‌ట్ల షారుక్ సంతోషం వ్య‌క్తం చేసారు. ఇలాంటి అవార్డు అందుకోవ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. అవార్డు రూపంలో మ‌రో గౌర‌వం ఎప్ప‌టి మ‌ర్చిపోలేనిది.

సౌదీ అరేబియా రావ‌డానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను' అని తెలిపారు. ప్ర‌స్తుతం షారుక్ ఖాన్ న‌టుడిగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఏక కాలంలోనే వివిధ షూటింగ్ ల్లో పాల్గొంటున్నారు. 'జ‌వాన్' స‌హా 'డంకీ'...'ప‌ఠాన్' చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇంకా రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ ప‌నుల్లోనూ త‌ల‌మున‌క‌లై ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.