Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: 2022లో అంత‌ర్జాతీయ గ్లామ్ పురుషులు

By:  Tupaki Desk   |   19 Nov 2022 3:50 PM GMT
టాప్ స్టోరి: 2022లో అంత‌ర్జాతీయ గ్లామ్ పురుషులు
X
సాంస్కృతిక- రాజకీయ- సామాజిక-ఆర్థిక రంగాల్లో విజయాలను గుర్తించి ప్రతియేటా అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. భారతీయ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లోను 2022లో శాశ్వతమైన ప్రభావాన్ని చూపిన ఆకర్షణీయమైన వ్యక్తులు ఎవ‌రు? అన్న‌ది ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర వివ‌రాలు తెలిసాయి. త‌మదైన అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌.. ప‌ని నైపుణ్యంతో ఆదర్శప్రాయమైన పనులతో ఈ సంవత్సరం చలనచిత్ర పరిశ్రమలో బలమైన ముద్ర వేసిన‌ వారి వివ‌రాలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని 2022లో ముద్ర వేసిన టాప్ 10 సెల‌బ్రిటీల వివ‌రాల్ని ప‌రిశీలిస్తే ..

తొలి నాలుగైదు స్థానాల్లో సౌత్ కి చెందిన ప్ర‌ముఖులు ఉన్నారు. వీళ్ల‌లో ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ స్టార్లు రామ్ చ‌ర‌ణ్ - జూనియ‌ర్ ఎన్టీఆర్ .. కేజీఎఫ్ 2 స్టార్ య‌ష్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే ద‌ర్శ‌క‌దిగ్గ‌జాల్లో ఆర్.ఆర్.ఆర్ ద‌ర్శ‌కుడిగా ఎస్.ఎస్.రాజ‌మౌళి పేరు.. కేజీఎఫ్ 2 ద‌ర్శ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ పేర్లు జాబితాలో నిలిచాయి.
అలాగే ఉత్త‌రాది నుంచి అమితాబ్ బ‌చ్చ‌న్- అజ‌య్ దేవ‌గ‌న్- కార్తీక్ ఆర్య‌న్ పేర్లు ప్ర‌ముఖంగా జాబితాలో చేరాయి. యువ‌ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ పేరు ఈ జాబితాలో చేరింది.

ఈ ఏడాది 1000 కోట్ల క్లబ్ లో చేరిన రెండు సినిమాలు ఉన్నాయి. వీటిలో న‌టించిన స్టార్లుగా రామ్ చ‌ర‌ణ్‌- జూనియ‌ర్ ఎన్టీఆర్ - య‌ష్ ల‌కు అసాధార‌ణ‌ గుర్తింపు ద‌క్కింది. వెయ్యి కోట్ల క్ల‌బ్ లో చేరిన ఆర్.ఆర్.ఆర్ స్టార్లుగా రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప ప్ర‌శంస‌లు కురిసాయి. భార‌త‌దేశంలోనే కాకుండా అమెరికా- బ్రిటిన్- ఆస్ట్రేలియా స‌హా ప‌లు దేశాల్లో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ పేర్లు మార్మోగుతున్నాయి. హాలీవుడ్ లోను ఆ ఇద్ద‌రూ చ‌ర్చ‌ల్లో వ్య‌క్తులుగా మారారు. ఇటీవ‌లే జ‌పాన్ లో ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుద‌లై బాహుబ‌లి రికార్డుల‌ను సైతం బ్రేక్ చేసింది. అదే క్ర‌మంలో చ‌ర‌ణ్‌- తార‌క్ పేర్లు జ‌పాన్ లోను మార్మోగాయి. ఇక ఆర్.ఆర్.ఆర్ లాంటి సంచ‌ల‌న చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగా ఎస్.ఎస్.రాజ‌మౌళి పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపించింది. ఇక క‌న్న‌డ రంగం నుంచి 1000 కోట్ల క్ల‌బ్ హీరోగా య‌ష్ సంచ‌ల‌నం సృష్టించి నిరంత‌రం వార్త‌ల్లో నిలిచాడు. ఒక సాధార‌ణ బ‌స్ డ్రైవ‌ర్ కొడుకు సాధించిన వెయ్యి కోట్ల క్ల‌బ్ విజ‌యంగా అభిమానులు ప్ర‌శంస‌లు కురిపించారు. కేజీఎఫ్ 2తో య‌ష్‌ స్థాయి అమాంతం పెరిగింది. అలాగే ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌శాంత్ నీల్ పేరు కూడా అంతే మార్మోగింది. కేజీఎఫ్ 2ని టెక్నిక‌ల్ గా టిఫిక‌ల్ క‌థ‌నంతో అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని గుర్తింపు ద‌క్కింది. అంత‌ర్జాతీయ పురుషుల దినోత్స‌వాన్ని పుర‌ష్క‌రించుకుని ఈ ఐదుగురి పేర్లు ప్ర‌ముఖంగా చ‌ర్చ‌ల్లోకొచ్చాయి.

బాలీవుడ్ షాహెన్ షా అమితాబ్ బచ్చన్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా ఉన్నారు. 50 ఏళ్లకు పైగా కెరీర్ తో తెరపై అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడానికి వయస్సు అడ్డంకి కాదని అతను మళ్లీ మళ్లీ నిరూపించాడు. 80 ఏళ్ల నటుడికి 2022 ప్రత్యేక సంవత్సరం. అతను ఈ సంవత్సరం ఐదు బాలీవుడ్ చిత్రాల‌తో టాప్ లిస్ట్ లో ఉన్నాడు. ఝుండ్- రన్ వే 34- బ్రహ్మాస్త్ర- గుడ్‌బై- ఉంఛైలో నటించాడు. వీటిలో బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మంచి ప్రదర్శనతో ఆక‌ట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి ప్రాబల్యం అనంత‌రం గుడ్ బై - ఉంచై కూడా ఈ సంవత్సరం చాలా చిత్రాలతో పోలిస్తే బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శనను సాధించాయి. అమితాబ్ ఈ ఏడాది పురుషుల్లో విజ‌యం సాధించిన గొప్ప వ్య‌క్తి. అత‌డు చాలా మందికి ప్రేరణ.

2022 అజయ్ దేవగన్ కి అత‌డి అభిమానులకు ప్రత్యేకమైన సంవత్సరం. ఈ ఏడాది 2020 చిత్రం `తన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్`లో తన నటనకు ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ అవార్డును దేవ‌గ‌న్ అందుకున్నాడు. భారత ప్రభుత్వం జాతీయ చలనచిత్ర అవార్డుల్లో అత‌డిని స‌త్క‌రించింది. ఈ పుర‌స్కార గౌర‌వంతో 53 ఏళ్ల నటుడికి ఈ సంవత్సరం మరింత ప్రత్యేకంగా మారింది. అలాగే దేవ‌గ‌న్ న‌టించిన‌ ఆరు సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. వాటిలో ఐదు థియేటర్లలో విడుదలయ్యాయి. 2022లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో `రుద్ర` అనే వెబ్ సిరీస్ తో దేవగన్ OTT అరంగేట్రం చేశాడు.

రన్ వే 34- గంగూబాయి కతియావాడి-RRR- థాంక్స్ గాడ్ చిత్రాల‌తో దేవ‌గ‌న్ ఏడాదంతా స్పీడ్ చూపించాడు. ఇటీవ‌ల‌ విడుదలైన తాజా చిత్రం దృశ్యం 2 థియేటర్లలో ర‌న్ అవుతోంది. ఈ సినిమా వంద కోట్ల క్ల‌బ్ లో చేరింది. దేవ‌గ‌న్ కి ఈ ఏడాది విజ‌యాల శాతం పెరిగింది.

ఉత్త‌మ ద‌ర్శ‌కులుగా ఆ ముగ్గురికీ గుర్తింపు:

ఉత్త‌మ పురుషులుగా ఎంపిక చేస్తే ఈ ఏడాది దర్శ‌క‌త్వ విభాగం నుంచి రాజ‌మౌళి- ప్ర‌శాంత్ నీల్- అయాన్ ముఖ‌ర్జీ పేర్ల‌ను ప్ర‌త్యేకంగా చేర్చాలి. దర్శకధీరుడు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి... ఎస్.ఎస్.రాజమౌళిగా పేరుగాంచిన సంగ‌తి తెలిసిందే. రాజమౌళికి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఎలా రూపొందించాలో స్పష్టంగా తెలుసు. ద‌ర్శ‌క‌ధీరుడి పని ప్రాక్టిక‌ల్ గా మాట్లాడుతుంది! ఈ ఏడాది సంచ‌ల‌న చిత్రం RRR చిత్రం ఆస్కార్ 2023 రేసులో కూడా ఉంది కాబట్టి 49 ఏళ్ల ఫిలింమేక‌ర్ రాజ‌మౌళికి ఈ సంవత్సరం ప్రత్యేక సంవత్సరం. RRR నిర్మాతలు 14 విభాగాలకు `ఫర్ మీ పరిశీలన (FYC)` విభాగంలో ప్రచారం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. బాహుబలి: ది బిగినింగ్-బాహుబలి 2 వంటి భారీ చిత్రాన్ని ఎంతో సృజ‌నాత్మ‌క కాన్వాసుపై సృష్టించిన రాజ‌మౌళి RRRతో మ‌రోసారి బాక్సాఫీస్ వద్ద అద్భుత మ్యాజిక్ ని చేయ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడు.

ఇక అత్యుత్త‌మ టెక్నిక్ తో కేజీఎఫ్ 2ని తెర‌కెక్కించిన కూల్ ప‌ర్స‌నాలిటీ ప్రశాంత్ నీల్ ని త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేదు. అత‌డు కేజీఎఫ్ - కేజీఎఫ్ 2 చిత్రాల‌తో సంచ‌ల‌నాలు సృష్టించి ఇప్పుడు ప్ర‌భాస్ తో స‌లార్ లాంటి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్నాడు. అత‌డు నిరంత‌ర వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ప్ర‌శాంత్ నీల్ లైన‌ప్ చూస్తుంటే వేరే ఏ ఇత‌ర ద‌ర్శ‌కుడికి లేనంత క్రేజ్ అత‌డికి ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. త‌దుప‌రి అత‌డు రామ్ చ‌ర‌ణ్ -చిరంజీవి- ఎన్టీఆర్ ల‌తో ప‌ని చేయ‌నున్నాడు. ప్ర‌భాస్ తో స‌లార్ త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌నున్నాడు. అలాగే మ‌హేష్ తోను ప‌ని చేసే అవ‌కాశం ఉంది.

ఈ ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ బ్ర‌హ్మాస్త్ర‌ దర్శకుడు అయాన్ ముఖర్జీ రచయిత‌గాను మ్యాజిక్‌ సృష్టించాడు. అతను బ్రహ్మాస్త్ర చిత్రానికి దర్శకత్వం వహించాడు. ర‌చ‌న విభాగంలో త‌న‌దైన మార్క్ చూపించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. చాలా విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొన్నా కానీ 2022లో అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఆసక్తికరంగా అతను ఇప్పటివరకు కేవలం మూడు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అవి వేక్ అప్ సిద్- యే జవానీ హై దీవానీ త‌ర్వాత‌ బ్రహ్మాస్త్రా తాజా చిత్రం. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఈ మూడు చిత్రాలలో అతని ప్రాణ స్నేహితుడు రణబీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించడం గమనార్హం. రెండు సినిమాల కిడ్ అయిన‌ అయాన్ ని న‌మ్మి క‌ర‌ణ్ జోహార్ బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రానికి ప‌ని చేసే అవ‌కాశం క‌ల్పించాడు. విమ‌ర్శ‌లు ఎన్ని ఎదుర్కొన్నా ఉత్త‌రాదిన బ్ర‌హ్మాస్త్ర చ‌క్క‌ని ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌డం అయాన్ కి పేరు రావ‌డం విశేషం.

హీరోల్లో య‌ష్ చాలా స్పెష‌ల్:

యష్ గా పాపుల‌రైన క‌న్న‌డ హీరో అస‌లు పేరు నవీన్ కుమార్ గౌడ. కేజీఎఫ్- చాప్ట‌ర్ 1 సంచ‌ల‌న విజ‌యం తర్వాత ఈ ఏడాది KGF: చాప్టర్ 2 తో అసాధార‌ణ విజ‌యం అందుకున్నాడు. కేజీఎఫ్ 2లో య‌ష్‌ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రస్తావించకపోతే 2022 అసంపూర్ణంగా ఉంటుంది. యష్ న‌టుడిగా మ‌రో లెవ‌ల్ ఏంటో చూపించాడు. బంగారు గ‌నుల్లో ఎదురేలేని మాఫియా డాన్ గా అద్భుత‌మైన ఆహార్యంతో ఆక‌ట్టుకున్నాడు. సంజయ్ దత్ లాంటి క్రేజీ స్టార్ త‌న ఎదుటే ఉన్నా ఎదురేలేని వాడిగా న‌టించి మెప్పించ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడు. ఈ ఏడాది ఏప్రిల్ 14న విడుదలైన KGF చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ స్థాయిలో 1200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అందువ‌ల్ల అత‌డు ఈ ఏడాది చాలా స్పెషల్ అని చెప్పాలి.

31 ఏళ్ల బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ డ్యాషింగ్ పెర్ఫామెన్సెస్ ఎల్ల‌పుడూ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 2022లో భూల్ భుల‌యా 2తో చిరస్మరణీయమైన విజ‌యం అందుకున్నాడు. బ్రహ్మాస్త్రా తర్వాత 2022లో అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో అతని కామెడీ హర్రర్ చిత్రం భూల్ భులయ్యా 2 నిలిచింది. ఇది రెండవ స్థానంలో నిలిచింది. స్పాట్. అతను తదుపరి శశాంక ఘోష్ థ్రిల్లర్ ఫ్రెడ్డీలో కనిపించనున్నాడు.

అయితే 2022లో అత్యంత‌ ప్రభావాన్ని చూపించిన‌ పురుషులు కేవ‌లం వీరు మాత్ర‌మేనా అంటే కానే కాదు. జాబితాలో ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అయితే భారీ అభిమానులు ఫాలోయింగ్ ఇత‌రత్రా అంశాల ఆధారంగా కొన్ని పేర్ల‌ను ప్ర‌త్యేకంగా తుపాకి ఎంపిక చేసుకుంది. దేశంలోని పురుషులంతా మంచి ఆరోగ్యం సానుకూలతతో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకోవాల‌ని ఆశిస్తున్నాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.