Begin typing your search above and press return to search.

మన కీరవాణి నాటుకు అంతర్జాతీయ గోల్డెన్ గ్లోబ్ పురస్కారం

By:  Tupaki Desk   |   11 Jan 2023 5:02 AM GMT
మన కీరవాణి నాటుకు అంతర్జాతీయ గోల్డెన్ గ్లోబ్ పురస్కారం
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో అంతర్జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఆస్కార్ తర్వాత అత్యంత గౌరవప్రదమైన అంతర్జాతీయ పురస్కారంగా పేరు దక్కించుకున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలో మన కీరవాణి స్వరపరిచిన నాటు నాటు సాంగ్‌ కి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు సొంతమయింది.

నామినేషన్స్ దక్కడమే గొప్ప విషయం అనుకుంటే ఏకంగా గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు దక్కడం అద్భుతం అన్నట్లుగా సినీ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై మరోసారి మన నాటు నాటు సాంగ్ రికార్డు సృష్టించింది. టాలీవుడ్ జక్కన్న సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో వచ్చే ఇద్దరు హీరోల సాంగ్ నాటు నాటు కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

అంతర్జాతీయ స్థాయి థియేటర్స్ లో స్క్రీనింగ్ అయిన సమయంలో నాటు నాటు సాంగ్ వచ్చినప్పుడు విదేశీయులు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ అవార్డు దక్కడం పట్ల కీరవాణి సంతోషం వ్యక్తం చేశారు. నాటు నాటు కి అవార్డు వచ్చిందంటూ ప్రకటించిన వెంటనే రాజమౌళితో పాటు ఎన్టీఆర్, చరణ్ అంతా కూడా చప్పట్లు కొడుతూ సందడి చేశారు.

ఇక అవార్డు తీసుకున్న తర్వాత కీరవాణి మాట్లాడుతూ.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోష సమయాన్ని నా సతీమణితో పంచుకోవడం మరింత ఆనందంగా ఉంది. నా సోదరుడు రాజమౌళి అవార్డు దక్కాలి.

ఈ పాటలో భాగస్వామ్యమైన రాహుల్ సిప్లిగంజ్ కి ధన్యవాదాలు. నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ పాట విషయంలో నా కుమారుడు కాలభైరవ కూడా అద్భుతమైన సహకారం అందించడానికి పేర్కొన్నారు. కీరవాణి పురస్కారం పొందడం పట్ల తెలుగు మరియు ఇండియన్‌ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.