Begin typing your search above and press return to search.
ఇండియన్ బ్రహ్మాస్త్ర కు అంతర్జాతీయ స్థాయి...!
By: Tupaki Desk | 9 May 2022 10:55 AM GMTబాలీవుడ్ బాహుబలి అంటూ బ్రహ్మాస్త్ర పై అంచనాలు భారీగా ఉన్నాయి. బాహుబలి 2 మరియు దంగల్ రికార్డులను బ్రేక్ చేయగల సత్తా కేవలం బ్రహ్మాస్త్ర కే ఉందని ప్రతి ఒక్క ఇండియన్ సినీ ప్రేమికులు ప్రేక్షకులతో పాటు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర ఈ ఏడాది సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. సినిమాలో చాలా విషయం ఉండటం వల్లే తెలుగు లో రాజమౌళి ఈ సినిమాను సమర్పించేందుకు ముందుకు వచ్చారు.
రణబీర్ కపూర్.. ఆలియా భట్.. మౌనీ రాయ్.. నాగార్జున.. అమితాబచ్చన్ లు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా లో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ఒక హాలీవుడ్ రేంజ్ లో ప్రమోట్ చేయడంతో పాటు అదే స్థాయిలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ డిస్నీ గ్లోబల్ వారితో ఒప్పందంను కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.
త్వరలో హాలీవుడ్ లో విడుదల కాబోతున్న అవతార్ 2 తో పాటు మరో మూడు భారీ ఇంగ్లీష్ సినిమాలతో పాటు బ్రహ్మాస్త్ర సినిమా ను వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ వారు భారీ ఎత్తున విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు గ్లోబల్ రేంజ్ లో ఒక ఇండియన్ సినిమాకు ఇలాంటి ఒక రిలీజ్ దక్కలేదు. ఇది ఖచ్చితంగా బ్రహ్మాస్త్ర యొక్క అరుదైన రికార్డు గా నిలువబోతుంది.
వాల్ట్ డిస్నీ స్టూడియోస్ వారు విడుదల చేయబోతున్న సినిమా అవ్వడం వల్ల ప్రతి ఒక్క దేశంలో కూడా మంచి క్రేజ్ బ్రహ్మాస్త్రకు దక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా బ్రహ్మాస్త్ర సినిమా ను పెద్ద ఎత్తున ప్రమోషన్ చేయడం ద్వారా ఖచ్చితంగా రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.
బ్రహ్మస్త్ర సినిమా ను అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్.. అపూర్వ మెహత ఇంకా పలువురు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హీరోగా నటిస్తున్న రణబీర్ కపూర్ కూడా ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తెలుగు లో నాగార్జున నటించడం వల్ల మంచి రేటు పలికే అవకాశం ఉందంటున్నారు. విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే దేశ వ్యాప్తంగా బ్రహ్మాస్త్ర హడావుడి మొదలు అయ్యింది. బ్రహ్మాస్త్ర మొదటి పార్ట్ ఈ సెప్టెంబర్ లో రాబోతుంది.