Begin typing your search above and press return to search.

సోనమ్ కి హాలీవుడ్ మీడియా షాక్

By:  Tupaki Desk   |   23 May 2017 5:51 PM IST
సోనమ్ కి హాలీవుడ్ మీడియా షాక్
X
హాలీవుడ్ మీడియాకి ఇండియా జనాలంటే చిన్న చూపు అనే విషయం ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. ప్రియాంక చోప్రా.. దీపికా పదుకొనే లాంటి అందాల భామలు అక్కడ సత్తా చాటుతున్నా సరే.. ఇండియన్స్ అంటే నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంటారు.

కొన్ని నెలల క్రితం దీపికా పదుకొనే లాస్ ఏంజెల్స్ ఎయిర్ పోర్టులో కనిపిస్తే. ఆమెను ప్రియాంకగా అభివర్ణిస్తూ హాలీవుడ్ మీడియా హంగామా చేసింది. ఇప్పుడు ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. కేన్స్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సోనమ్ కపూర్ సందడి చేసింది. కానీ.. సోనమ్ ను దీపికగా అభివర్ణిస్తూ.. 'ఇండియన్ యాక్ట్రెస్ దీపికా పదుకొనే కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు వచ్చింది' అంటూ వెస్ట్రన్ ఫోటో ఏజన్సీ ఒకటి రాసేసింది. దీంతో సోనమ్ అందాల విందు కంటే.. ఈ తప్పిదమే ఎక్కువ ఫోకస్ అయిపోయింది.

ఇలాంటి సంఘటనలపై గతంలోనే దీపికా పదుకొనే రియాక్ట్ అయింది కూడా. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని.. మనం అంటే వారికి ఉన్న చిన్నచూపును చాటుతోందని చెప్పింది దీపికా. ఒకే రంగులో ఉన్న ఇద్దరు.. ఒకే వ్యక్తి కావాల్సిన అవసరం లేదని బాలీవుడ్ మీడియాకు తెలియదని కూడా అనేసింది దీపిక.