Begin typing your search above and press return to search.
RRR ను డామినేట్ చేసిన చిన్న సినిమా
By: Tupaki Desk | 28 Jun 2022 6:30 AM GMTఈ సంవత్సరం IMDB ( ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) టాప్ 250 ఇండియా నుంచి చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ RRR ఈ ప్రతిష్టాత్మక జాబితాలో 169 వ స్థానంలో నిలిచింది. అయితే RRR కంటే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకొని కన్నడ నుండి రెండు చిత్రాలు ఈ జాబితాలోకి ప్రవేశించాయి. RRRని అధిగమించేలా నిలవడం విశేషం.
ఇండియన్ సినిమాల్లో 101వ స్థానంలో ఉన్న KGF-2 కొనసాగుతుండగా, ఆ తరువాత స్థానంలో ఈ జాబితాలో 116వ స్థానంలో రక్షిత్ శెట్టి నటించిన ‘777 చార్లీ’ నిలిచింది. 777 చార్లీ సినిమాకి 9000 ఓట్లతో 9.2/10 IMDB రేటింగ్ వచ్చింది.
ఈ కన్నడ చిత్రం బజరంగీ భాయిజాన్, DDLJ, నయట్టు, బాహుబలి, KGF-1 అలాగే ది గ్రేట్ ఇండియన్ కిచెన్ వంటి కొన్ని క్లాసిక్ భారతీయ చిత్రాలను కూడా అధిగమించింది. 777 చార్లీ సినిమాను బి కె. కిరణ్‌రాజ్ తెరకెక్కించగా జూన్ 10న తెలుగు కన్నడంలో థియేటర్లలో విడుదలైంది.
ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ తో కన్నడలో మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు కూడా వచ్చాయి. చార్లీ అనే కుక్క జీవితంతో హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అతని జీవితం ఎలా మారింది అలాగే అతనితో చార్లీ తన బంధాన్ని ఎలా పంచుకుంటుంది అనేదే అసలు సినిమా. చూస్తుంటే భవిష్యత్తులో భాషతో సంబంధం లేకుండా బడ్జెట్ తో తేడాలు లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలు డామినేట్ చేస్తాయని చెప్పవచ్చు.
ఇక చార్లీ సినిమా కమర్షియల్ గా తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక KGF 3 కమర్షియల్ గానే కాకుండా జనాల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఏకంగా RRR సినిమా కంటే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకోవడం విశేషం.
అలాగే ఇండియా మొత్తంలో రెండు కన్నడ సినిమాలు టాప్ లిస్ట్ లో చేరడం విశేషం. ఇక రానున్న రోజుల్లో ఇంకా కొన్ని కంటెంట్ ఉన్న సినిమాలు రాబోతున్నాయి కాబట్టి ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.