Begin typing your search above and press return to search.

మహర్షిలో అదిరిపోయే ఎపిసోడ్

By:  Tupaki Desk   |   26 Dec 2018 11:53 AM IST
మహర్షిలో అదిరిపోయే ఎపిసోడ్
X
భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న 25వ సినిమాగా భారీ అంచనాలు మూటగట్టుకున్న మహర్షి షూటింగ్ కీలకమైన రామోజీ ఫిలిం సిటీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. చిన్న బ్రేక్ తో మళ్ళి వచ్చే నెల నుంచి కంటిన్యూ చేయబోతున్నారు. ఇప్పటికే దీని మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ముగ్గురు అగ్ర నిర్మాతల కాంబో కాబట్టి నిర్మాణపరంగా కూడా చాలా హై స్టాండర్డ్స్ లో రూపొందుతున్న మహర్షి బిజినెస్ పరంగా కూడా కొత్త రికార్డులు సెట్ చేసేలా ఉంది.

ఇకపోతే ఇందులో ఒక కీలకమైన ఎపిసోడ్ కు సంబంధించిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదే ఇంటర్వెల్ బ్లాక్. గతంలో మహేష్ సినిమాల్లోని రానంత వైవిధ్యంగా కీలకమైన ట్విస్టుకు సంబంధించి గూస్ బంప్స్ ఇచ్చే ఎలివేషన్ తో ఇది ఉంటుందని తెలిసింది.

ఈ ఎపిసోడ్ లో మహేష్ అల్లరి నరేష్ లతో సహా కీలకమైన తారాగణం మొత్తం ఉంటుందని తెలిసింది. తెలిసిన సమాచారం మేరకు మహేష్ అమెరికా నుంచి పల్లెటూరికి వెళ్ళే క్రమంలో ఇది వస్తుందట. అక్కడే భారీ ఫైట్ సీక్వెన్స్ తో పాటు మహర్షి యుఎస్ నుంచి ఇండియాకు ఎందుకు వచ్చాడు అనే పాయింట్ కు జస్టిఫికేషన్ జరిగేలా వంశీ పైడిపల్లి సరికొత్తగా ప్రెజెంట్ చేసినట్టు చెబుతున్నారు.

ఫ్యాన్స్ కోరుకునే అంశాలకు లోటు లేకుండా సెన్సిబుల్ గా అనిపించే పాయింట్ తో ఇది రూపొందినట్టు తెలిసింది. పాటల చిత్రీకరణ కూడా వచ్చే నెల నుంచి మొదలుపెట్టె అవకశాలు ఉన్నాయి. విడుదలకు అటు ఇటుగా వంద రోజులకు కొంత అదనంగా మాత్రమే టైం ఉన్న మహర్షి కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ అప్పుడే కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు