Begin typing your search above and press return to search.
పూనం పంజా ఎవరి మీద?
By: Tupaki Desk | 14 April 2018 6:28 AM GMTఆ మధ్య పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు క్రిటిక్ కత్తి మహేష్ కు మధ్య జరిగిన ఇష్యూ లో కొద్ది రోజులు బాగా హై లైట్ అయిన నటి పూనం కౌర్ ఈ సారి ట్విట్టర్ ద్వారా కాకుండా నేరుగా వీడియో ఇంటర్వ్యూ రూపంలో రాబోతోంది. అది ఒక సాధరణ ముఖాముఖి అయితే ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. కాని సదరు న్యూస్ ఛానల్ ఆ ప్రోగ్రాంకు పెట్టిన పేరు అందులో పూనం లేవనెత్తిన అంశాలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. కేవలం ప్రోమోతోనే ఇంత హాట్ టాపిక్ గా మారిన ఈ ఇంటర్వ్యూ ఫుల్ వెర్షన్ లో ఇంకా ఏమేం ఉంటాయో అన్న ఆసక్తి అందరిలో మొదలయింది. ఇందులో ఎవరి గురించి తాను విమర్శలు చేస్తోందో ఎవరి మీద యుద్ధం ప్రకటించిందో అర్థం కాక అబిమానులు పజిల్ లాగా ఫీల్ అవుతున్నారు. ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడనని అందులో చెప్పిన పూనం కౌర్ గురు గోవింద్ కూతురిగా అబద్దం చెప్పడం కాని యుద్ధం నుంచి పారిపోవడం కాని చేయనని తేల్చి చెప్పింది.
చచ్చిపోయిన శవాలతో యుద్ధం చేయను లాంటి ఘాటైన వ్యాఖ్యలు చేసిన పూనం కౌర్ ఇప్పుడు ఏ కొత్త ఇష్యూ మీద బాంబులు వేయబోతోందా అంటూ ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. దానికి తోడు సదరు న్యూస్ ఛానల్ ప్రోగ్రాం కి పంజాబీ పంజా అని పెట్టడం చూస్తే అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. హరిద్వార్ పవిత్ర స్థలంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలకు చాలా విశ్వసనీయత ఉంటుందని అనుకోవచ్చు. దానికి ఒకే కారణం కౌర్ వర్గీయులు ఎవరు కూడా అక్కడ అసత్యం ఆడటం కాని తప్పులు చేయటం కాని చేయరు. సో పూనం కౌర్ బయట పెట్టే సంచలన విషయాలు నిజమే అనుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. పూర్తి వెర్షన్ వచ్చాక కాని స్పష్టత రాదు కాబట్టి ఈ లోపే దీని మీద రకరకాల విశ్లేషణలు మొదలైపోయాయి.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి