Begin typing your search above and press return to search.
బాగున్న పాట.. వేస్టయినట్లుంది
By: Tupaki Desk | 22 Nov 2017 3:30 PM GMTహాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఐటెమ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ప్లేస్ కి షిఫ్ట్ అవ్వడానికి చాలానే కృషి చేస్తోంది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా అమ్మడు అన్ని ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ బాగానే చేస్తోంది. బాలీవుడ్ లో గట్టి రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నా సౌత్ లో సినిమాలను బట్టి రెమ్యునరేషన్ ని తీసుకుంటోందట. ఇక ఆమె ప్లాన్స్ కూడా చాలానే సక్సెస్ అవుతున్నాయి.
ఏ స్పెషల్ సాంగ్ చేసినా భారీ స్థాయిలో ఆదరణను అందుకుంటోంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సన్నీ స్పెషల్ సాంగ్స్ చాలా వరకు హిట్ అవుతున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే పూర్తి హీరోయిన్ గా ట్రై చేస్తోన్న సన్నీ ప్రస్తుతం తేరా ఇంతేజార్ అనే సినిమాలో నటిస్తోంది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బజ్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమాలోని టైటిల్ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.
అయితే శ్రేయా ఘోషల్ పాడిన ఆ పాట చాలా బావుంది. కానీ సన్నీమాత్రం పాటకు సెట్ అయ్యే హావభావాలను ఇవ్వడంలో కొంచెం తడబడింది. ఇక కథానాయకుడు కూడా అదే తరహాలో కనిపించాడు. సాంగ్ లో ఉన్న పాయింట్ కి ఇద్దరు కనెక్ట్ కాకపోవడంతో బాగున్న పాట కూడా వేస్ట్ అయినట్లే అని చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క పాటలోనే ఇలా చేసారా లేక సినిమాల్లో కూడా ఇలానే చేశారా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.