Begin typing your search above and press return to search.
సెక్స్ సీన్లకు సంధానకర్తగా 'ఇంటిమసి కోఆర్డినేటర్లు': వీళ్లు ఏం చేస్తారంటే..?
By: Tupaki Desk | 19 April 2021 5:30 PM GMTభారత సినిమాల్లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలే కనుపడుతాయి. డైరెక్టర్లు తమ సినిమాల్లో సెక్స్ సీన్లు ఎక్కువగా కనిపించకుండా జాగ్రత్తపడుతారు. ఒకవేళ అలాంటి సీన్ తీయాల్సి వచ్చినప్పుడు పాలు పొంగడం.. రెండు పూలు ముద్దాడుకోవడం.. దుప్పటి నలిగిపోవడం లాంటివైపు కెమెరా వెళ్తుంది. అయితే ముద్దు సీన్ కూడా కనిపించని ఇండియన్ సినిమాలో దశాబ్ధ కాలంలో రాను రాను ఆ సన్నివేశం ఇప్పుడు సినిమా పోస్టర్ పై కూడా కనిపిస్తోంది. ఇక కొన్ని బాలీవుడ్ సినిమాల్లో ఒకడుగు ముందుకేసి న్యూడ్ రొమాన్స్ లాంటి సీన్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి న్యూడ్, రొమాన్స్ సీన్లు తీయడానికి హీరోయిన్లకు, నటీమణులకు కొంచెం గెల్టీ ఫీల్ గానే ఉంటుంది. అటు కొందరు దర్శకులు కూడా తమకు కావాల్సింది నటులతో చేయలేకపోతారు. దీంతో దర్శకులు, హీరోయిన్ల మధ్య 'ఇంటిమసి కో ఆర్డినేటర్లు'సీన్ పండడానికి సహకరిస్తారు. ఇంతకీ వారేం చేస్తారు..? అసలు ఇంటిమసి కో ఆర్డినేటర్లు అంటే ఎవరు..?
1992లో వచ్చిన 'బేసిక్ ఇన్ స్టింక్స్' సినిమాలో ఓ సన్నివేశం కోసం తనను అండర్ వేర్ తీసేయ్యమన్నారని నటి షరాన్ స్టోన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన అనుభవాన్ని ఆమెచెబుతూ 'ఓ సన్నివేశం తీసేటప్పుడు అండర్ వేర్ తీసేయ్యని, అది తెల్లగా ఉండడం వల్ల లైట్ రిఫ్లెక్ట్ అవుతుందని ఆ సినిమా డైరెక్టర్ పాల్ వెర్హోవెన్ చెప్పారని అన్నారు. కానీ డైరెక్టర్ మాత్రం ఆమె ఆరోపణలను ఖండించారు. అయితే అక్కడ ఏం జరుగుతుందో షరాన్ కు తెలుసన్నారు.
అయితే ఇండియాలోనూ ఇలాంటి సీన్ల వద్ద కొందరు నటులు ఇబ్బంది పడ్డారని కొందరు ఆరోపణలను బట్టి తెలుస్తోంది. 1990ల ప్రారంభంలో 'బేసిక్ ఇన్ స్టింక్స్'సినిమా సమయంలో కూడా ఇలాంటివి జరిగాయని అంటున్నారు. అయితే 2017లో 'మీటూ' ఉద్యమం తరువాత ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులు, లైంగిక దోపిడీలపై వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఈ సమస్యకు పులిస్టాప్ పెట్టాలని కొందరు భావించారు. అయితే ఈ విషయంలో 'ఇంటిమసి కో ఆర్డినేటర్ల 'సహాయం తీసుకోవాలని అనుకున్నారు.
1970లో అమెరికాలో 'డ్యూస్' అనే సినిమా కోసం 'ఇంటిమసి కో ఆర్డినేటర్ల'ను వినియోగించుకున్నారట. అప్పటి నుంచి మిగతా ఇండస్ట్రీలు కూడా ఇలాంటి నియామకాల కోసం మొగ్గు చూపారట. వీరు దర్శకులు, నిర్మాతలకు మధ్య హీరోయిన్లకు కో ఆర్డినేటర్లుగా ఉంటారు. సెక్స్ సీన్లు తీసే విధానంపై అటు దర్శకులకు ఇటు నటీమణులకు సౌకర్యవంతంగా వ్యవహరిస్తారు.
ఇండియాలో ప్రస్తుతం ఆస్తా ఖన్నా అనే ఇంటిమసి కో ఆర్డినేటర్ బాలీవుడ్లో ఫేమస్ గా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'నేనే చేసే పని యాక్షన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్లాగే ఉంటుంది. అయితే అది రొమాంటిక్ సీన్లకు పనిచేయాల్సి ఉంటుంది. స్టంట్ చేస్తున్నప్పుడు యాక్షన్ డైరెక్టర్లు తమ భద్రతను చూసుకున్నట్లే సెక్స్ సీన్లు తీయాల్సి వచ్చినప్పుడు నేను నటులు, డైరెక్టర్ల భద్రత చూసుకుంటాను'అని చెప్పారు.