Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్ : ఏం ఫ్యామిలీరా బై అంతా హౌలేగాళ్లే వున్న‌రు!

By:  Tupaki Desk   |   25 Nov 2022 8:18 AM GMT
టీజ‌ర్ టాక్ : ఏం ఫ్యామిలీరా బై అంతా హౌలేగాళ్లే వున్న‌రు!
X
విభిన్న‌మైన టాక్ షోలు, సిరీస్‌లు, సినిమాల‌తో ఆక‌ట్టుకుంటున్న తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా'. తాజాగా మ‌రో వింతైన ఫ్యామిలీ క‌థ‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతోంది. రాహుల్ రామ‌కృష్ణ‌, న‌రేష్‌, న‌వ్యా స్వామి, సుర‌భి ప్ర‌భావ‌తి, గంగ‌వ్వ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన ఆహా ఒరిజిన‌ల్ సిరీస్ 'ఇంటింటి రామాయ‌ణం'. స‌రేష్ న‌రెడ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్ ని ద‌ర్శ‌కుడు మారుతి, సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.

ఓ వింత ఫ్యామిలీ రామాయ‌ణం నేప‌థ్యంలో ఆత్యంత ఆస‌క్తిక‌ర మ‌లుపులు, హాస్య భ‌రిత స‌న్నివేశాల‌తో 'ఇంటింటి రామాయ‌ణం' సాగేలా క‌నిపిస్తోంది. డిసెంబ‌ర్ 16 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం మేక‌ర్స్ టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. ప‌క్కా తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో రూపొందిన సిరీస్ ఇది. క‌రీంన‌గ‌ర్ నేప‌థ్యంలో సాగే క‌థ‌గా దీన్ని రూపొందించారు. గ్రామీణ వాతావ‌ర‌ణం త‌ల‌పించే విజువ‌ల్స్ తో టీజ‌ర్ మొద‌లైంది.

మీద‌స‌లు హైలైట్ అన్నా..మీ అసోంటి గొప్ప ఫ్యామిలీ ఏ ఊర్లో ఉండ‌ద‌న్నా..అంటూ రాహుల్ రామ‌కృష్ణ ఫ్రెండ్ చెబుతున్న డైలాగ్ లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. రాములు అనే వ్య‌క్తి త‌న‌యుడు.. అత‌ని ఫ్యామిలీ చుట్టూ అల్లుకున్న క‌థ‌గా ఆత్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతుంద‌ని తెలుస్తోంది. ఇలాంటి ఫ్యామిలీ ఓ స‌మ‌స్య‌లో ఇరుక్కుంటుంది.

దాని కోసం ఫ్యామిలీ అంతా పోలీస్టేష‌న్ కు వెళుతుంది. ఈ కుటుంబ స‌భ్యుల గురించి తెలుసుకున్న ఎస్ ఐ 'ఏం ఫ్యామిలీరా బై అంతా హౌలేగాళ్లే .. ఒక్కొక్క‌రికి ఒక్కో క‌థ వుంది..

అంటూ చెప్పే డైలాగ్ లు న‌వ్వులు పూయిస్తున్నాయి. ఇంత‌కీ రాములు కుటుంబ సభ్యుల క‌థ‌లేంటీ?.. వారి క‌థ‌లు తెలుసుకుని ఎస్‌.ఐ ఎందుక‌లా అన్నాడు?..ఇంత‌కీ ఈ ఇంటి రామాయ‌ణం ఏ మ‌లుపులు తీసుకోబోతోంది? అన్న‌ది తెలియాలంటే డిసెంబ‌ర్ 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న 'ఇంటింటి రామాయ‌ణం' చూడాల్సిందే. రాహుల్ రామ‌కృష్ణ‌, సీనియ‌ర్ న‌రేష్‌, న‌వ్యా స్వామి, గంగ‌వ్వ‌, సుర‌భి ప్ర‌భావ‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ ఓరిజిన‌ల్ టీజ‌ర్ తోనే ఆక‌ట్టుకుంటూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాల్లో వుండే కామెడీ, కోపాలు.. దాని ద్వారా పుట్టే ఎమోష‌న్స్ నేప‌థ్యంలో ఈ మూవీని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది. దీని ద్వారా మారుతి, నాగ‌వంశీ తొలి సారి ఓటీటీ వ‌ర‌ల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. చూస్తుంటే తొలి ప్రాజెక్ట్ తో సూప‌ర్ స‌క్సెస్ ని సొంతం చేసుకునేలా క‌నిపిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.