Begin typing your search above and press return to search.
మాయా పేటిక తెరిచేది ఎవరో?
By: Tupaki Desk | 8 Jun 2022 2:30 PM GMTవినూత్నమైన చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. దీంతో న్యూ టాలెంట్ కొత్త తరహా చిత్రాలకు శ్రీకారం చుడుతోంది. ఇటీవల అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, అనిష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `థాంక్యూ బ్రదర్`. వినూత్నమైన కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీకి రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. గత ఏడాది ప్రేక్షకల ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ని సొంతం చేసుకుంది.
థియేటర్లలో కాకుండా తెలుగు క్రేజీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అయిన ఈ మూవీ మంచి ఆదరణ ని సొంతం చేసుకుంది. గర్భిణి, ఓ యువకుడు లిఫ్ట్ లో ఇరుక్కుంటారు. ఆ తరువాత ఏం జరిగింది? .. ఎలాంటి మలుపులు తిరిగింది వంటి ఆసక్తికరమైన కథా, కథనాలతో `థాంక్యూ బ్రదర్` మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ తరువాత ఇదే సంస్థ నుంచి వస్తున్న మరో వినూత్నమైన మూవీ `మాయా పేటిక`.
`థాంక్యూ బ్రదర్` మూవీని రూపొందించిన రమేష్ రాపర్తి తాజా చిత్రాన్ని కూడా జస్ట్ ఆర్డినరీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారంక్ నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని హీరో రానా దగ్గుబాటి బుధవారం విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా వుంది. టీమ్ మెంబర్స్ అందరికి బెస్ట్ విషెస్...` అని రానా ట్వీట్ చేశారు. మొబైల్ ఫోన్ నేపథ్యంలో ఈ మూవీని సరికొత్త కథతో తెరకెక్కిస్తున్నట్టుగా కాన్సెప్ట్ పోస్టర్ తో స్పష్టమవుతోంది.
మధ్యలో షూటింగ్ జరుతుంటే సెల్ ఫోన్ లైటింగ్ తో కొంత మంది ఫొటోలు తీస్తున్నట్టుగా చూపించారు. ఇక టెర్రాస్ పై నిలుచుని ఓ యువకుడు, ఓ యువతి లవ్ ని ఎక్స్ ప్రెస్ చేసుకుంటున్నట్టుగా ఇద్దరి ఫొటోలని బ్లాక్ అండ్ వైట్ లో చూపించారు. గుణ బాలసుబ్రమణియన్ సంగీతం, సురేష్ రాగుట్టు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీలో ఎవరు నటిస్తున్నారు?.. ఇంతకీ మాయా పేటికని తెరిచేది ఎవరు? అన్నది త్వరలోనే చిత్ర బృందం వెల్లడించనుంది.