Begin typing your search above and press return to search.
వినాయక్.. తర్వాత ఎవరబ్బా?
By: Tupaki Desk | 13 Feb 2018 7:23 AM GMT‘ఖైదీ నంబర్ 150’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వి.వి.వినాయక్ తనతో సినిమా చేయడం తన అదృష్టమని చెప్పాడు ‘ఇంటిలిజెంట్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సాయిధరమ్ తేజ్. కానీ వాస్తవం ఏంటంటే.. ‘ఖైదీ’ తర్వాత వినాయక్‌తో పని చేయడానికి ఏ స్టార్ హీరో అందుబాటులో లేడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయినప్పటికీ దాని తాలూకు క్రెడిట్ వినాయక్‌కు పెద్దగా దక్కలేదు. ఎందుకంటే అది రీమేక్ మూవీ. పైగా చిరు రీఎంట్రీ మేనియా దానికి కలిసొచ్చింది. దాని కంటే ముందు వినాయక్ తీసిన ‘అఖిల్’ సంగతేంటో తెలిసిందే. ఇంకా వెనక్కి వెళ్లినా వినాయక్ పరిస్థితి అంతంతమాత్రమే. ఇంతకుముందు వినాయక్ అంటే కళ్లు మూసుకుని డేట్లిచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ సైతం వినాయక్ తో సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపించని పరిస్థితి వచ్చిందంటే ఈ స్టార్ డైరెక్టర్ మీద హీరోలకు గురి ఎలా తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత సాయిధరమ్ తేజ్‌తో సినిమా చేశాడు వినాయక్. ఆ సినిమా ఫలితమేంటో తెలిసిందే.
‘ఖైదీ నంబర్ 150’ లాంటి సినిమా తర్వాతే వినాయక్ కు స్టార్లు ఎవరూ దొరకలేదు. మరి ఆయన కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాగా పేరు తెచ్చుకుని పెద్ద డిజాస్టర్ అయిన ‘ఇంటిలిజెంట్’ తర్వాత అతడిని ఎవరు నమ్ముతారు? ఏ స్టార్ సినిమా చేయడానికి ముందుకొస్తాడు. ఒకప్పుడైతే వినాయక్ మార్కు ఫార్ములా సినిమాలు బాగా ఆడేవి కానీ.. గత కొన్నేళ్లలో ప్రేక్షకుల అభిరుచి ఎంతో మారిపోయింది. ఇప్పుడంతా కొత్తదనానికే పట్టం కడుతున్నారు. హీరోలు కూడా రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేయడానికి ఇష్టపడట్లేదు. ఇంతకుముందు మసాలా సినిమాలే చేసిన రామ్ చరణ్ సైతం ఇప్పుడు భిన్నమైన సినిమాలతో సాగుతున్నాడు. ఈ పరిస్థితుల్లో వినాయక్ కు ఓ మోస్తరు స్టార్ దొరకడం కూడా కష్టమే. మరి అతను ఎవరితో తన తర్వాతి సినిమా చేస్తాడో చూడాలి.