Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: అదే మసాలా ఇంటిలిజెంట్!!
By: Tupaki Desk | 5 Feb 2018 4:35 AM GMTగత నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయ్.. ఈ సినిమా మాత్రం చాలా జాగ్రత్తగా చేశాను.. వివి వినాయక్ గారు నాతో ఒక అద్భుతం సృష్టించారు అన్నట్లు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చెబుతుంటే.. అదంతా నిజమేనేమో అనీ ఫీలింగ్ అందరికీ వచ్చేసింది. కాని నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాక కూడా అదే మసాలా కమర్షియల్ సినిమా విత్ రొటీన్ స్టఫ్ చేశాడా అనే సందేహం మాత్రం 'ఇంటిలిజెంట్' ట్రైలర్ చూశాక కలుగుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. అమాయకమైన సాఫ్టువేర్ ఇంజనీర్.. చాలా మంచోడు.. ఒకమ్మాయిని ప్రేమలో కూడా పడేశాడు.. కాని ఒక ప్రాబ్లమ్ రావడంతో ధర్మాబాయ్ అనే ఎలియాస్ పేరొకటి పెట్టుకుని.. కొంతమందిని చంపేస్తున్నాడు. ఇటువంటి కథలను మనం ఇప్పటికే అనేకం చూశాం. అయితే దీనిని ఇంటిలిజెంటుగా ఎంత కొత్తగా తీశారనే విషయంపైనే సక్సెస్ ఆధారపడుతుంది. కాని సాయిధరమ్ తేజ్ అండ్ వినాయక్ మాత్రం ఆ పాత స్కూలును ఇంకా వదిలిపెట్టలేదు. సింపుల్ గా ఉన్నా కూడా చితక్కొట్టేశే మాస్ హీరో.. అతనికి భయపడే రిచ్ విలన్.. మద్యలో కామెడీ విలన్లు.. ఒక్క ముక్కలో ఇంటిలిజెంట్ సినిమా అంతా అదేనంటూ ట్రైలర్లోనే సెలవిచ్చారు. పైగా 'ధర్మా బాయ్' అంటూ సాయిధరమ్ చెబుతున్నా కూడా.. ఆ సౌండింగ్ కు ఉండాల్సిన వైబ్రేషన్ మాత్రం ఎక్కడా ప్రేక్షకులను తాకకపోవడం ఆశ్చర్యం.
కేవలం తమన్ మ్యూజిక్ ఒకటే రీ-రికార్డింగ్ పరంగా ఎప్పటిలాగానే కాస్త ఆకట్టుకుంది కాని.. తక్కిన ట్రైలర్ అంతా కూడా మెగా మాస్ ప్రేక్షకులను తప్పిస్తే మామూలు మెగా ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకునేలా లేదు. ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతున్న సదరు సినిమాకు ఇంత రొటీన్ ట్రైలర్ ను సరిగ్గా రిలీజ్ ముందు రిలీజ్ చేసి అభిమానులను నిరాశపరిచారనేది టాక్. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం.