Begin typing your search above and press return to search.

న‌య‌న్ దంప‌తుల స‌రోగ‌సీ వివాదంపై విచార‌ణ షురూ!

By:  Tupaki Desk   |   13 Oct 2022 10:36 AM GMT
న‌య‌న్ దంప‌తుల స‌రోగ‌సీ వివాదంపై విచార‌ణ షురూ!
X
న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ దంప‌తుల చుట్టూ స‌రోగ‌సీ వివాదం ముదురుతోంది. గ‌త ఆదివారం ఈ దంప‌తులు తాము త‌ల్లిదండ్ర‌లైన‌ట్టుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించి మాకు ఇద్ద‌రు ట్విన్ బాయ్స్ జ‌న్మించార‌ని తెలియ‌జేస్తూ ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల పాదాలు మాత్ర‌మే చూపిస్తూ వున్న ఓ ఫొటోని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. జూన్ 9న ఇరు కుటుంబాల అంగీకారంతో న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ అట్ట‌హాసంగా వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.

అంతే కాకుండా వీరి వివాహానికి సంబంధించిన వీడియోని న‌య‌న‌తార డాక్యుమెంట‌రీగా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ మ‌ల‌చ‌డం, దాని స్ట్రీమింగ్ హ‌క్కుల‌ని ప్ర‌ఖ్యాత ఓటీటీ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి ద‌క్కించుకోవ‌డం హాట్ టాపిక గా మారింది. ఈ వీడియో స్ట్రీమింగ్ ప్రారంభానికి ముందే న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ త‌మ‌కు క‌ల‌వ‌ల పిల్ల‌లు పుట్టారంటూ ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డం ఇప్ప‌డు మ‌రో వివాదానికి దారి తీసింది.

పెళ్లై నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఈ దంప‌తులు పేరెంట్స్ కావ‌డంతో స‌రోగ‌సీ ద్వారానే వీరు సంతానాన్ని పొందార‌ని స్ప‌ష్ట‌మైంది. దీంతో న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ జంట జుట్టూ స‌రోగ‌సీ వివాదం మొద‌లైంది.

త‌మిళ‌నాట ఈ వార్త దావాన‌లంలా వ్యాపించ‌డం, నెటిజ‌న్ లు కామెంట్ ల వ‌ర్షం కురిపిస్తుండ‌టంతో విష‌యం కాస్తా త‌మిళ ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు వెళ్లింది. దీంతో న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ల సంతానంపై విచార‌ణ చేప‌డ‌తామ‌ని త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం. సుబ్ర‌మ‌ణియ‌న్ వెల్ల‌డించారు.

ఆయ‌న చెప్పిన‌ట్టుగానే ముగ్గురు స‌భ్యుల‌తో ప్ర‌త్యేక క‌మిటీని నియ‌మించింది. ఆరోగ్య శాఖ‌కు సంబంధించిన త్రిస‌భ్య క‌మిటీ న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ల క‌వ‌ల‌ల‌పై ముదురుతున్న స‌రోగ‌సీ వివాదంపై విచార‌ణ చేప‌ట్టి ప్ర‌భుత్వానికి నివేదిక‌ను ఇవ్వ‌బోతోంది.

న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ల‌కు వివాహం అయి కేవ‌లం నాలుగు నెల‌లు మాత్ర‌మే అవుతోంది. ఇంత త‌క్కువ స‌మ‌యంలో ఇద్ద‌రు క‌ల‌వ‌ల‌ల‌కు వీరు పేరెంట్స్ కావ‌డం వివాదంగా మారింది. దీంతో ప్ర‌భుత్వం స‌రోగ‌సీ కార‌ణంగానే వీరు పిల్ల‌ల‌ని క‌న్నార‌ని భావించి దీనిపై తాజాగా విచార‌ణ చేప‌ట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.