Begin typing your search above and press return to search.
ఐపీఎల్ వర్సెస్ బాహుబలి.. విన్నర్ ఎవరో
By: Tupaki Desk | 6 April 2017 7:54 AM GMTఐపీఎల్.. ఏటేటా ఇండియాలో సమ్మర్ లో జరిగే ఈ క్రికెట్ సంబరానికి జనాలు బాగానే అలవాటు పడిపోయారు. దాదాపు వేసవి మొత్తం జరిగే ఈ క్రికెట్ పండుగ తాజాగా ప్రారంభమైంది. సాధారణంగా ఐపీఎల్ జరిగే టైంలో.. ముఖ్యంగా కీలకమైన మ్యాచ్ ల సమయంలో సినిమా కలెక్షన్స్ కు దెబ్బపడుతుండడం చూశాం.
కానీ ఈ సారి మాత్రం ట్రెండ్ రివర్స్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రేపటి నుంచి థియేటర్లలో చెలియా సందడి చేయనుండగా.. వచ్చేవారం మిస్టర్ మూవీ విడుదల కానుంది. మ్యాచ్ లన్నీ సాయంకాలాలు కావడంతో.. పగలు కలెక్షన్స్ కి అంతగా ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. పైగా ప్రారంభంలో ఐపీఎల్ మ్యాచ్ లలో అంత జోష్ కనిపించదు. కాంపిటీషన్ ఓ స్థాయికి వచ్చాక వ్యూయర్ షిప్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఆ సమయానికల్లా బాహుబలి2 థియేటర్లలోకి వచ్చేయనుంది.
దేశవ్యాప్తంగా బాహుబలి2 ప్రభావం అంతో ఇంతో ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఏప్రిల్ 28నుంచి ఐపీఎల్ వ్యూయర్ షిప్ కి భారీగానే గండిపడే అవకాశాలున్నాయి. పైగా రెండు మూడు వారాలపాటు బాహుబలి సునామీ ఉండొచ్చని అంచనాలున్నాయి. ఈ ఏడాది సమ్మర్ రేస్ బాహుబలి2 వర్సెస్ ఐపీఎల్ అన్నట్లుగా ఉంది. ఈ పోటీలో బాహుబలికే ఎక్కువ ఓట్లు పడతాయని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. వాస్తవం తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/