Begin typing your search above and press return to search.
ఇంటర్వ్యూ: ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం
By: Tupaki Desk | 4 Aug 2021 10:46 AM GMTహశ్వంత్ వంగా - నమ్రత దరేకర్ - కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’. వై.యుగంధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ (గోపి) ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి.. అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ కథతో ఈ సినిమా రూపొందింది. ఆగస్ట్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు యుగంధర్ ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు...
- దర్శకుడిగా నాకిది తొలి సినిమా. దర్శకుడు కాకముందు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ప్రొడక్షన్ మేనేజర్ గా కూడా పనిచేశాను. మాది పశ్చిమ గోదావరి జిల్లాలో లక్ష్మీపురం దగ్గర దేవపల్లి అనే గ్రామం. సినిమాలంటే చిన్నప్పట్నుంచి ఉన్న ఆసక్తితో నా జర్నీని స్టార్ట్ చేశాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 'దాసు' 'ఒరేయ్ తమ్ముడు' 'పృథ్వీనారాయణ' 'ఒట్టేసి చెబుతున్నా' 'రాధాగోపాలం' 'రామ్' 'అల్లరి బుల్లోడు' చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా వర్క్ చేశాను. బాపు గారంటే గౌరవం. ఆయన 'రాధాగోపాలం' సినిమాకు పని చేసేటప్పుడు డైరెక్షన్ గురించి నేర్చుకున్నాను. అలాగే వాసుగారి దగ్గర కూడా డైరెక్షన్ గురించి నేర్చుకున్నాను. వర్క్ చేయకుండా చూసే దర్శకత్వం గురించి అవగాహన పెంచుకున్నాను. ప్రొడక్షన్ డిజైనర్ గా 'సోలో' నా చివరి చిత్రం.
‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ కథ ఎప్పుడు రాసుకున్నారు?
- కరోనా ఫస్ట్ వేవ్ కంటే ముందే చిత్రీకరణ పూర్తి చేశాం. రీరికార్డింగ్ పూర్తి చేసేటప్పటికి సెకండ్ వేవ్ వచ్చింది. లేకుంటే ఎప్పుడో ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ రిలీజై ఉండేది. ప్రొడక్షన్ మేనేజర్ నుంచి డైరెక్టర్ అయిన నేను.. కథను తయారు చేసుకోవడం నుంచి, సినిమా ముగించే వరకు ఓ డైరెక్టర్ ఎలాంటి ఇబ్బందులు పడతాడో, ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నాను. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ ను డైరెక్ట్ చేయడం కంటే ముందే స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి కథలు తయారు చేసుకున్నాను. ఆవేవీ మెటీరియలైజ్ కాలేదు. ఆ సమయంలోనే దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ కథను కొత్త వాళ్లతో చేయడానికి సిద్ధమయ్యాను.
ఈ సినిమా టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
- ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే చేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? అని తొందరపడి చేసే పనులు సమస్యలను తెచ్చిపెడతాయనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ టైటిల్ ను పెట్టాం. కథకు తగ్గ టైటిల్. ఇదొక రొమాంటిక్ కామెడీ చిత్రం. అలాగే మంచి మెసేజ్ కూడా సినిమాలో ఉంటుంది. అదేంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉండే ఓ సెన్సిటివ్ అంశాన్ని ఎలివేట్ చేసేలా ఈ సినిమాను తీశాను.
ట్రైలర్ రిలీజ్ తర్వాత కాంట్రవర్సీ కావడంపై మీరేమంటారు? సినిమా బోల్డ్ గా ఉంటుందా?
- సినిమా అంతా బోల్డ్ గా తీయలేదు. ఓ సీక్వెన్స్ మాత్రం అలా ఉంటుందంతే. ఆ సీక్వెన్స్ ను ఇప్పటి వరకు ఎవరూ అటెంప్ట్ చేయలేదని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. అది ఎరోటిక్ గా ఉంటుంది. ఆ సీన్స్ వల్ల సినిమా ఎలా ఉంటుందోనని అందరూ భావించారు. కానీ సినిమా మరో కోణంలో సాగుతుంది. అలాగే టీజర్ విడుదల తర్వాత కొన్ని కాంట్రవర్సీలు ఎదుర్కోవాల్సి వచ్చాయి. ఆ సమస్యలు ఇప్పుడు క్లియర్ అయ్యాయనే అనుకుంటున్నాం. నేను ఏదీ కావాలని చేయలేదు. టైటిల్ సాంగ్ లో భజ గోవిందం అనే లైన్స్ ఉంటాయి. సాంగ్ వల్ల ఎవరికీ ఇబ్బందిగా అనిపించలేదు. అయితే టైటిల్ సాంగ్ ను ట్రైలర్ లో ఉపయోగించాను. విజువల్స్ - భజ గోవిందం అనే లైన్స్ రాంగ్ టైమింగ్ లో కనిపించడం అనేది కాంట్రవర్సీ అయ్యింది. అది నేను గమనించకపోవడం అనేది నా తప్పు.. దర్శకుడిగా అనుభవం లేకపోవడమే దానికి కారణం కావచ్చు.
ప్రొడక్షన్ మేనేజర్ గా చేసిన అనుభవం దర్శకత్వ చేయడంలో ఎంత వరకు పనికొచ్చింది?
- ప్రొడక్షన్ మేనేజర్ గా చేసిన ఎక్స్‌పీరియెన్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నప్పుడు బాగానే ఉపయోగపడింది. అయితే బడ్జెట్ విషయంలో ఫెయిల్ అయ్యాను. గోవాకు వెళ్లినప్పుడు రెండో రోజునే హీరోయిన్ కు యాక్సిడెంట్ జరిగింది. దాని వల్ల అక్కడ షూటింగ్ చేయలేకపోయాం. డబ్బులు కూడా మొత్తంగా చెల్లించాల్సి వచ్చింది. అలా బడ్జెట్ లో 30-40 లక్షల రూపాయలు అనుకున్న దానికంటే ఎక్కువగా అయ్యింది. మిగతాదంతా అనుకున్నట్లుగానే జరిగింది.
ప్రొడ్యూసర్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది?
- ఈ సినిమా విషయంలో నాకున్న ధైర్యమే నా నిర్మాత చింతా గోపాలకృష్ణగారు. చాలా పెద్ద పారిశ్రామిక వేత్త. సినిమా అంటే ఉండే ప్యాషన్ తో ఈ రంగంలోకి వచ్చారు. ప్రతి సంవత్సరం రెండు, మూడు సినిమాలు చేయాలనే వచ్చారు. శ్రీ చక్ర ఎంటర్టైన్మెంట్స్ వారు ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేను.
హీరో, హీరోయిన్ గురించి..?
- హశ్వంత్ వంగా - నమ్రత దరేకర్ ఇద్దరూ కొత్తవాళ్లే. అమ్మాయిది ముంబై. డాక్టర్ చదువుకుంది. అబ్బాయి ఇక్కడివాడే. ఇద్దరు బాగా చేశారు.
మరి మీ తదుపరి చిత్రాలు..?
- డిస్కషన్ దశలో ఉన్నాయి. ఆరు జోనర్స్ కు సంబంధించిన ఆరు కథలున్నాయి. `ఇప్పుడు కాక ఇంకెప్పుడు` రిలీజ్ తర్వాత నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేస్తాం.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు యుగంధర్.