Begin typing your search above and press return to search.
సీబీఐ సూపర్ హీరో చేతికి సుశాంత్ కేసు
By: Tupaki Desk | 20 Aug 2020 2:30 AM GMTబాలీవుడ్ హీరో సుశాంత్ కేసు విషయంలో కొనసాగుతున్న వివాదానికి సుప్రీం కోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే అంటూ సుప్రీం కోర్టు ముంబయి పోలీసులను ఆదేశించింది. సీబీఐకి ఈ కేసులో సంపూర్ణంగా సహకరించాల్సిందిగా ఆదేశించడం జరిగింది. సుప్రీం ఆదేశాలు రావడమే ఆలస్యం సీబీఐ ఈ కేసును జాయింట్ డైరెక్టర్ మనోజ్ శశిధర్ కు అప్పగిస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. గుజరాత్ క్యాడర్ కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఈయన. సీబీఐలో ఈయనకు సూపర్ హీరో అనే పేరు ఉంది. ఏ కేసు టేకప్ చేసినా తక్కువ సమయంలోనే పూర్తి చేయడంతో పాటు నేరస్తులకు సింహ స్వప్నంగా నిలుస్తూ ఉంటాడు.
చిన్న పాయింట్ ను కూడా వదలకుండా ఈయన టీం కేసును ఎంక్వౌరీ చేయబోతుంది. కనుక సుశాంత్ కేసు విషయంలో న్యాయం జరుగుతుందని కుటుంబ సభ్యులు మరియు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ రాజ్ పూత్ కేసు ను ముంబయి పోలీసులు పక్క దారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. పాట్నా పోలీసుల విషయంలో వారు వ్యవహరించిన తీరు చూస్తుంటే ఆ అనుమానం నిజమేనేమో అనిపిస్తుంది.
ఈ కేసును టేకోవర్ చేసేందుకు మనోజ్ శశిధర్ టీం రేపు ముంబయి చేరుకోనున్నారు. వెంటనే ముంబయి పోలీస్ కమీషనర్ తో భేటీ అయ్యి కేసు వివరాలతో కూడిన ఫైల్ ను తీసుకోనున్నారు. ఆ ఫైల్ ను స్టడీ చేసిన తర్వాత ఈ కేసును మొదటి నుండి ఎంక్వౌరీ చేయాలా లేదంటే వారు సేకరించిన వివరాలతో ముందుకు వెళ్లాలో వారు నిర్ణయించుకునే అవకాశం ఉంది. మనోజ్ శశిధర్ గత కేసుల ట్రాక్ రికార్డ్ ను బట్టి చూస్తే ఖచ్చితంగా సుశాంత్ కేసులో న్యాయం జరుగుతుందని దోషులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు.