Begin typing your search above and press return to search.
ఓవర్ హైప్ కారణంగానే ఆ ప్రొడక్షన్ హౌస్ కి ప్లాప్స్ వస్తున్నాయా..?
By: Tupaki Desk | 11 Dec 2020 10:39 AM GMTయువ హీరో నాగ శౌర్య కుటుంబం సినిమా నిర్మాణంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఐరా క్రియేషన్స్ బ్యానర్ ని స్థాపించి 'ఛలో' 'అశ్వథామ' వంటి సినిమాలను నిర్మించారు. ఈ క్రమంలో ఇటీవలే నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.4 చిత్రాన్ని ప్రారంభించారు. అలానే ఐరా క్రియేషన్స్ బ్యానర్ కి అనుబంధంగా 'ఐరా సినిమాస్' అనే మరో కొత్త బ్యానర్ ఏర్పాటు చేశారు. సన్నీ కోమలపాటి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఓ థ్రిల్లర్ ని స్టార్ట్ చేశారు. అయితే ఐరా క్రియేషన్స్ టీమ్ తాము ప్రొడ్యూస్ చేసే సినిమాలకి ముందు నుంచే ఫుల్ హైప్ ఇస్తుంటారని.. ఈ ఓవర్ హైప్ కారణంగానే కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తూ ఉంటుంది.
ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో మొదటి సినిమా 'ఛలో' సూపర్ హిట్ గా నిలిచింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య - రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టింది. అయితే ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు నిరాశ పరిచాయి. ప్రచార చిత్రాలతో హైప్ క్రియేట్ చేసిన 'అశ్వథామ' సినిమా కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అయితే ఓవర్ హైప్ కారణంగానే 'ఛలో' తరువాత ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయని సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రొడక్షన్ నెం.4 విషయంలో కూడా అలానే జరుగుతోందని.. ఇకనైనా వీరు సైలెంట్ గా సినిమా ముగించి ఆ తరువాత హడావుడి చేస్తే బెటర్ ఏమో అనే కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.