Begin typing your search above and press return to search.
మనిషి కుక్కను ప్రేమించినా.. కుక్క మనిషిని ప్రేమించినా మనిషి మంచోడని దీని తాత్పర్యం!!
By: Tupaki Desk | 23 July 2021 3:30 AM GMTముద్దు ముద్దుగా అల్లరిగా కనిపించే క్యూట్ పప్పీలంటే అందరికీ ప్రేమ.. ఇదిగో ఇక్కడ స్టార్ డాటర్ ఇరా ఖాన్ కూడా అంతే ముచ్చట పడుతున్నారు. తన ప్రియుడు నుపుర్ శిఖారేతో కలిసి ఇలా కుక్క పిల్లలతో ఆటలాడుకుంటున్నారు. వాటిని చేతులతో సుతారంగా తాకుతూ జూలు దువ్వుతూ ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు.
ఇదంతా ఎక్కడ..? అంటే ప్రస్తుతం ఈ అందమైన జంట పర్వత సానువుల్లోకి వెళ్లారు. అక్కడ ఈ ప్రత్యేకమైన కొండ ప్రాంతపు కుక్క పిల్లలను దగ్గరకు పిలిచి ఇలా ముద్దాడేస్తున్నారు.
ఒక అందమైన కొండ ప్రాంతం నుండి ఇరా ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరా అక్కడ ఎంతో ముద్దొచ్చేస్తున్న అందమైన ఒక చిన్న కుక్కపిల్లని పట్టుకోగా.. నూపూర్ ఆమె పక్కన నిలబడి సరదాగా నవ్వుతూ కనిపిస్తున్నారు.
ఇక ఇరాతో నుపూర్ ప్రేమాయణం గురించి తెలిసిందే. ఇరాకు వ్యక్తిగత జిమ్ కోచ్ గా పని చేసేప్పుడు ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అటుపై తమ కుటుంబీకులతోనూ ఓపెనప్ అయ్యారు. ప్రస్తుతం ఈ జంట ఘాడమైన ప్రేమలో ఉన్నారు. తమ నిరంతర రొమాంటిక్ డేట్ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఆ ఇద్దరూ నిరంతరం షేర్ చేస్తున్నారు.
ఈ ఫోటోలకు అద్భుత స్పందన వస్తోంది. పర్వత ప్రాంతంలో కుక్క పిల్లలు సో స్వీట్ !! అని అభిమానులు ప్రశంసించారు. ``మనిషి కుక్కను ప్రేమిస్తున్నప్పుడు .. హి ఈజ్ మంచి మనిషి .. కుక్క మనిషిని ప్రేమిస్తున్నప్పుడు హి ఈజ్ మంచి మనిషి ...`` అంటూ ఒక అభిమాని కవితల్ని అల్లాడు. మనిషి కుక్కను ప్రేమించినా.. కుక్క మనిషిని ప్రేమించినా మనిషి మంచోడని దీని తాత్పర్యం. ఇరా ఖాన్ అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కుమార్తె అన్న సంగతి తెలిసినదే.