Begin typing your search above and press return to search.
వీడియో: ప్రియుడు నుపూర్ తో అమీర్ ఖాన్ డాటర్
By: Tupaki Desk | 1 Jun 2021 5:30 AM GMTమిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె తన వ్యక్తిగత జిమ్ కోచ్ నుపూర్ శిఖారేతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరాఖాన్ స్వయంగా అతడిని ప్రపంచానికి పరిచయం చేసారు. ఆ తర్వాతా ఆ ఇద్దరూ జంటగా ఉన్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. నూపూర్ కుటుంబంతోనూ ఇరా ఖాన్ ఎంతో కలిసిపోయి సన్నిహితంగా కనిపించడంతో ఇక ఈ జంట పెళ్లికి సమయం ఆసన్నమైందని భావించారు.
సోమవారం (మే 31) ఇరా తన డ్రీమ్ బాయ్ నుపూర్ శిఖారేపై తన ప్రేమను తెలియజేయడానికి ఇన్ స్టా లో ఆసక్తికర పోస్ట్ ని చేశారు. `నువ్వే నా యాంకర్` అంటూ వ్యాఖ్యను జోడించింది. తమ ప్రేమైక జీవనానికి స్నేహానికి సంబంధించిన రకరకాల ఫోటోల బంచ్ ని మాషప్ వీడియో రూపంలో ఇరా తన ఇన్ స్టాలో షేర్ చేశారు. వీడియోతో పాటు ఆమె శిఖారే కోసం ఒక స్వీట్ నోట్ రాసింది. మీరు నా యాంకర్ ....`` # ప్రేమ # డ్రీమ్‌బాయ్ # హాష్‌ట్యాగ్ లు తెలివితక్కువ అనిపిస్తాయి. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను..``అని నోట్ రాశారు. దానికి నుపూర్ స్పందిస్తూ `ఐ లవ్ యు.. యార్` అని రిప్లయ్ ఇచ్చాడు. టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ కూడా హార్ట్ ఈమోజీని షేర్ చేశారు.
ఆ ఇద్దరూ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. కానీ ఇరా ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే నుపుర్ ను తన ప్రేమికుడిగా ప్రపంచానికి పరిచయం చేసారు. నుపూర్ ఫిట్నెస్ ట్రైనర్ .. కొంతకాలంగా ఇరాకు శిక్షణ ఇస్తున్నారు. ఈ జంట తమ శిక్షణా వీడియోలను తమ వ్యక్తిగత ఇన్ స్టాగ్రామ్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. ఇరాతో పాటు నూపూర్ దశాబ్ద కాలంగా సుష్మితా సేన్ కు శిక్షణ ఇస్తున్నారు. అమీర్ ఖాన్ కి కూడా అతడు జిమ్ కోచ్.
ఇరా అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కుమార్తె. తల్లిదండ్రులు విడిపోయాక హాస్టల్ జీవనంలో ఇరా తన మానసిక వేదనను తనపై లైంగిక వేధింపుల ప్రహసనాన్ని కూడా కవితల రూపంలో వివరించారు. ఇరా ఎప్పుడూ కెమెరా వెనుక ఉండటం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఒక స్టేజీ డ్రామాకు ఇరా దర్శకత్వం వహించారు. ఇరా- నుపూర్ సాన్నిహిత్యానికి అమీర్ ఖాన్ సైతం తన ఆమోదం తెలిపారని సంకేతాలు స్పష్ఠంగా కనిపిస్తున్నాయి.