Begin typing your search above and press return to search.
దెబ్బకు దెబ్బే సమాధానం అటావా?
By: Tupaki Desk | 15 May 2022 3:30 PM GMTబాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ పుట్టిన రోజు వేడుకలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో అమీర్ తో పాటు కుటుంబ సభ్యలు పాల్గొన్నారు. బర్త్ డే అంటే అందంగా ముస్తాబై దేవుడు పూజ చేసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న పుట్టిన రోజు కాదిది. ఐరాఖాన్ ఫ్యామిలీతో కలిసి పూల్ సైడ్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది.
అంటే స్విమ్ షూట్ ధరించి స్విమ్మింగ్ పూల్ లో కాసేపు ఈతకొట్టొచ్చి అవే బికినీ దుస్తుల్లో కేక్ కట్ చేసింది. అప్పుడు ఆ ప్రక్కనే తండ్రి అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. దీంతో ఐరాఖాన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైంది. తండ్రి ముందు బికిని ఏంటి? సిగ్గుందా? అని ట్రోలింగ్ చేసారు. నెటి జనులు ఐరా తీరును దుమ్మెత్తిపోసారు.
మనం ఇలాంటి సోసైటీలో ఉన్నామా? అంటూ మండిపడ్డారు. కానీ ఐరాఖాన్ వీటిని పట్టించుకోలేదు. కానీ కొంత మంది సెలబ్రిటీలు మాత్రం ఐరాకి అందులో తప్పేముందని మద్దతునిచ్చారు. తాజాగా ఈ ట్రోలింగ్ పై ఐరాఖాన్ స్పందించింది. అది ఎలాగే తెలిస్తే షాక్ అవుతారు. మరికొన్ని బికినీ ఫోటోల్ని షేర్ చేసి ఈసారి ఇంకా రెచ్చిపోండని సంకేతాలు పంపింది.
`నేను ఇంతకు ముందు షేర్ చేసిన పుట్టిన రోజు ఫోటోల్ని ద్వేషించడం..అసహ్యించుకోవడం పూర్తయిందా? ఇంకా మరికొన్ని పంపిస్తున్నాను. ఇంకా ఉంటాయని` ఓ క్యాప్సన్ ఇచ్చి మరింత రెచ్చగొట్టింది. ఈసారి ప్రియుడితో ఈత కొడుతున్న ఫోటోల్ని లీక్ చేసింది. దీంతో ఐరా తీరుపై బాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. మంచి పనిచేసావు. కొంత మంది నోళ్లు మూయించాలంటే ఇలాగే స్పందించాలని మద్దతు ఇస్తున్నారు.
చెంప పగిలే సమాధానంలా నిలిచిందంటూ సెలబ్రిటీలు అంతా సపోర్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోలపై అంతే ధీటుగా విమర్శించే వాళ్లు అదే పనిమీద ఉన్నారు. ట్రోలింగ్ ఏమాత్రం తగ్గలేదు. రెట్టింపు ట్రోలర్స్ బరిలోకి దిగి ఐరా భరతం పడుతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటివి సహజం. సెలబ్రిటీలు ఎప్పుడూ టార్గెట్ అవుతుంటారు. ట్రోలింగ్ కి గురవుతుంటారు. ఆ క్షణం సీరియస్ అయిన తర్వాత అంతా మామూలే. ఆ జనాలంతా సినిమాలు చూస్తేనే వీళ్లంతా స్టార్లు అయ్యేది.