Begin typing your search above and press return to search.
అప్పటి హ్యాకర్ ని ఇప్పుడు పట్టేశారు
By: Tupaki Desk | 22 Nov 2017 5:38 AM GMTబడా సంస్థల పోర్టల్స్ ను హ్యాకింగ్ చేయడం.. కీలకమైన వివరాలను తస్కరించి.. ఆయా కంపెనీలను బ్లాక్ మెయిల్ చేయడం ఇప్పుడు తరచుగా కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం హెచ్ బీఓ ఛానల్ వెబ్ సైట్ హ్యాకింగ్ గురైన సంగతి తెలిసిందే. సూపర్ హిట్ టీవీ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కు సంబంధించిన స్క్రిప్టులు.. ప్లాట్ సమ్మరీస్ హ్యాకింగ్ కి గురయ్యాయని.. ఛానల్ వర్గాలు ఓపెన్ గానే ప్రకటించాయి.
అప్పట్లో హ్యాకింగ్ చేసిన వ్యక్తిని ఇప్పుడు యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఇరానియన్ హ్యాకర్ ఈ చోరీకి పాల్పడ్డాడని తేల్చారు. బెహ్ జాద్ మెస్రీ అనే ఇరాన్ కు చెందిన వ్యక్తి ఇటు హ్యకింగ్ చేయడంతో పాటు.. తనకు 6 మిలియన్ యూఎస్ డాలర్ల విలువైన బిట్ కాయిన్స్ కరెన్సీని ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో పాటు.. కర్బ్ యువర్ ఎంథూజియాజం వంటి పలు కామెడీ సిరీస్ లకు సంబంధించి.. అప్పటివరకూ టెలికాస్ట్ కాని ఎపిసోడ్స్ ను చోరీ చేశాడని.. ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఇలా హ్యాకింగ్ చేసిన డేటాలో కొంత బాగాన్ని లీక్ చేశాడు కూడా.
ఇరాన్ కు చెందిన టర్క్ బ్లాక్ హ్యాట్ సెక్యూరిటీ హ్యాకింగ్ గ్రూప్ లో ఈ మెస్రీ సభ్యుడు అంటున్నారు యూఎస్ అధికారులు. ప్రస్తుతం ఇతను 7 కేసులను ఎదుర్కొంటూ ఉండగా.. గతంలో యూఎస్ న్యూక్లియర్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్.. ఇజ్రాయిల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లను కూడా హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి.