Begin typing your search above and press return to search.

సినిమా : ఇర్ఫాన్ బౌలింగ్ హిట్‌.. మ్యాచ్‌ పోయింది

By:  Tupaki Desk   |   1 Sep 2022 11:30 AM GMT
సినిమా : ఇర్ఫాన్ బౌలింగ్ హిట్‌.. మ్యాచ్‌ పోయింది
X
క్రికెట్ లో ఒక క్రికెటర్ అరంగేట్రం చేసిన సమయంలో ఆ మ్యాచ్ ఓడిపోయిన ఆ మ్యాచ్ లో అతడి ప్రతిభ బాగుంటే తదుపరి మ్యాచ్ లకు కంటిన్యూ చేస్తారు. అయితే సినిమా ఇండస్ట్రీ లో మాత్రం కాస్త విభిన్నంగా ఉంటుంది. మొదటి సినిమాలో ఎంత గొప్పగా నటించినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అయితే కెరీర్ లో ముందు ముందు కష్టపడాల్సి వస్తుంది. సినిమా సక్సెస్ అయ్యే వరకు సదరు నటుడికి ఆఫర్లు అంతంత మాత్రంగానే వస్తూ ఉంటాయి.

తాజాగా ప్రముఖ టీమ్‌ ఇండియా క్రికెటర్ ఇర్ఫాన్ ఫఠాన్ సినిమా రంగంలో అడుగు పెట్టాడు. తమిళ్‌ స్టార్‌ హీరో విక్రమ్‌ నటించిన కోబ్రా సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్‌ పాత్రలో కనిపించాడు. సినిమాలో ఆయన పాత్రకు ప్రాముఖ్యత బాగానే ఉంది.. ఆ పాత్రకు తగ్గట్లుగా ఇర్ఫాన్‌ పఠాన్ బాగానే నటించాడు. కానీ కోబ్రా సినిమా వినాయక చవితి కి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ ను మూట కట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో పఠాన్ ఎంట్రీ ఒక ఫెయిల్యూర్ తో ఉండటంతో ఆయన కెరీర్ భవిష్యత్తులో ఎలా ఉంటుందో క్లారిటీ లేదు. తప్పకుండా ఆయన నుండి ముందు ముందు మంచి సినిమాలు వస్తాయంటూ కొందరు ఆయన అభిమానులు నమ్మకం గా ఉంటే.. ఆయనకు ఫెయిల్యూర్‌ సెటిమెంట్‌ తో ఆఫర్లు ఇచ్చేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కోబ్రా సినిమా కమర్షియల్‌ గా హిట్ అయ్యి ఉంటే తప్పకుండా ఇర్ఫాన్ పఠాన్ ఇప్పటికే రెండు మూడు సినిమాలైనా కమిట్‌ అయ్యేవాడు. తెలుగు సినిమా నిర్మాతలు మరియు దర్శకులు కూడా ఇర్ఫాన్‌ తో సంప్రదింపులు మొదలు పెట్టేవారు. కానీ కోబ్రా సినిమా ఫలితం తారుమారు అవ్వడంతో కాస్త అటు ఇటు అయ్యింది.

ఇర్ఫాన్ పఠాన్ మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆయనకు ఆఫర్లు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ అది స్టార్‌ హీరోల సినిమాల్లోనా లేదా చిన్న హీరోల సినిమాల్లోనా అనేది తెలియాల్సి ఉంది. ఏదో ఒక సినిమా.. వచ్చిన ఆఫర్‌ లను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఏదో ఒక సమయంలో ఆయనకు సక్సెస్‌ దక్కవచ్చు.. అప్పుడు సినిమాల్లో ఇర్ఫాన్‌ బిజీ అవ్వొచ్చు.

క్రికెట్‌ లో అర్థాంతరంగా కెరీర్‌ ను ముగించాల్సి వచ్చిన ఇర్ఫాన్ కి సినిమా ఇండస్ట్రీ లో భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది రాబోయే ఏడాది రెండేళ్లలో ఆయన చేయబోతున్న సినిమాలు.. ఆయన చేసే పాత్రలను బట్టి ఉంటుంది. మరి మంచి బాల్స్ వేసి సక్సెస్ అవుతాడో లేదంటే వైడ్స్ వేసి మళ్లీ ఆఫర్‌ కోల్పోతాడో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.