Begin typing your search above and press return to search.

ఇష్టంలేకపోయినా లిప్పులాకు అంటున్న ఇర్రామోర్

By:  Tupaki Desk   |   19 Nov 2018 5:30 PM GMT
ఇష్టంలేకపోయినా లిప్పులాకు అంటున్న ఇర్రామోర్
X
'శృంగారం నాలుగు గోడల మధ్య' అనేది పాత నానుడి. ఇప్పుడు శృంగారం నాలుగు గోడలు దాటి పబ్లిక్ లోకి.. పార్కుల్లోకి వచ్చేసింది. ఇక సినిమాల్లో అయితే బోల్డ్ సీన్లు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. లిప్పు లాకులు.. ఇంటిమేట్ సీన్లు కామన్ అయ్యాయి. హీరో.. హీరోయిన్లు లిప్పు లాకుల విషయంలో సరిహద్దులు చెరిపేస్తున్నారు. త్వరలో రిలీజ్ కానున్న 'భైరవ గీత' లో కూడా లిప్పు లాకులు ఉన్నాయి.

ఈ సినిమాలో ధనంజయ్ హీరోగా నటిస్తే.. ఇర్రా మోర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన 'భైరవగీత' ట్రైలర్లో ఇర్రా మోర్ లిప్పులాకు అందరి దృష్టిని ఆకర్షించింది. చిత్రమైన విషయం ఏంటంటే తనకు లిప్ లాకులు అసలు నచ్చవని.. తప్పనిసరి పరిస్థితిలోనే లిప్ లాక్ సీన్స్ చేశానని అంటోంది. ఇష్టం లేకుండా ఎందుకు లిప్ లాక్ చేశావని అడిగితే.. కథ డిమాండ్ మేరకు అలా చేయాల్సివచ్చిందని చెప్పింది. అందరి మధ్యలో లిప్ లాక్ చేయడం నచ్చకున్నా హీరోయిన్ గా అది తన బాధ్యత అని గుర్తుచేసుకుని ఆ సీన్స్ కంప్లీట్ చేసిందట.

ఇర్రా మోర్ అయినా.. షాలిని పాండే అయినా.. పాయల్ రాజ్ పుత్ అయినా ఎవరైనా 'స్క్రిప్ట్ డిమాండ్'.. డైరెక్టర్ చెప్పిన మేరకే హీరోలతో లిప్ లాక్ చేస్తారు. సీన్ లో లేకుండా ఊరికే ఆషాడం ఆఫర్ లాగా మూతి ముద్దులు ఇవ్వరు కదా? లిప్ లాకులని చాలామంది తేలిగ్గా తీసిపడేస్తారు గానీ ఇర్రా మోర్ తన మొదటి సినిమాకే ఇంత ఫిలాసఫీ చెప్పిందంటే టాలీవుడ్ లో ఫ్యూచర్ ఉన్నట్టే.