Begin typing your search above and press return to search.
ఆ నిబ్బరానికి హాట్స్ ఆఫ్
By: Tupaki Desk | 16 July 2018 10:47 AM GMTఎంత పెద్ద తారలైనా ఎంత సంపద ఉన్నా ఒకోసారి విధి ఆడే నాటకంలో ఎవరైనా పావులా మారాల్సిందే అన్న దానికి ఉదాహరణగా ఇటీవల ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్న సినిమా స్టార్స్ ను చూస్తూనే ఉన్నాం. ఇటీవలే సోనాలి బెంద్రే తనకు కాన్సర్ ఎటాక్ అయిన కారణంగా జుత్తు మొత్తం కత్తిరించుకోవడాన్ని చూసి అభిమానులు కన్నీళ్లతో కరిగిపోయారు. అంతకు ముందు మనీషా కొయిరాలా-లీసా రే-మమతా మోహన్ దాస్ అందరిది ఇదే కథ. కానీ వాళ్ళ మనోనిబ్బరమే వాళ్లకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ధైర్యంగా ఎదురుకుని మళ్ళి సినిమాల్లో తమ సత్తా చాటుతున్నారు. వీళ్ళందరూ ఫిమేల్ ఆర్టిస్టులు. కానీ వీళ్ళ కన్నా తీవ్రమైన వ్యాధికి గురై అసలు బ్రతుకుతాడా లేదా అనే భయాన్ని కలిగించిన ఇర్ఫాన్ ఖాన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఆరు నెలల క్రితం న్యూరో ఎండోక్రైనో అనే వ్యాధి చికిత్స కోసం లండన్ తో పాటు అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్న ఇర్ఫాన్ ఖాన్ ఈమధ్యే సోషల్ మీడియాలో వచ్చేసాడు.
తన డిస్ప్లే పిక్ ని మార్చి తాను క్షేమంగా ఉన్నాననే మెసేజ్ ఇచ్చేసాడు. కాకపోతే మొహం బాగా పీక్కుపోయి మనిషి బక్కపలచగా మారి తనను ఆ వ్యాధి ఎంతగా పీల్చి పిప్పి చేసిందో ఒక్క ఫోటో రూపంలోనే చాటి చెప్పేసాడు. అయినా కూడా చెక్కుచెదరని చిరునవ్వుతో ఎలాగైనా పూర్తిగా ఆరోగ్యంతో బయటపడతాను అనే ధీమాని మొహంలో చూపించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. ఇర్ఫాన్ ఖాన్ నటించిన బ్లాక్ మెయిల్ ఆ మధ్య విడుదలై కమర్షియల్ గా మంచి విజయాన్నే అందుకుంది. దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కార్వాన్ లో ఇర్ఫాన్ దే కీలక పాత్ర. దాని విడుదల కోసం విష్ చేస్తూ ఇటీవలే మెసేజ్ చేసిన ఇర్ఫాన్ ఖాన్ ఇండియాకు ఎప్పుడు తిరిగి వచ్చేది మాత్రం ప్రస్తావించడం లేదు.