Begin typing your search above and press return to search.

దిగ్గజ నటుడికి రోగమా?

By:  Tupaki Desk   |   5 March 2018 4:48 PM GMT
దిగ్గజ నటుడికి రోగమా?
X
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై నటనలో ఒక ప్రాణం ఉందని చెప్పే నటీనటులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. ఆయన సింపుల్ నటనలోనే ఎదో తెలియని మాయ ఉంటుంది. కనుసైగలతో ప్రేమను అలాగే క్రూరత్వాన్ని తెరపై చూపించగలరు. ఆయన నటిస్తున్నట్లు కొంచెం కూడా అనుమానం రాదు. ఆ పాత్ర నిజం అనేలా ఇర్ఫాన్ అందరిని మాయ చేస్తారు. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించారు.

టాలీవుడ్ సైనికుడు సినిమాలో విలన్ గా కనిపించిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ తెరపై కూడా ఇర్ఫాన్ ఖాన్ తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే..రీసెంట్ గా ఆయన నెటీజన్స్ కి ఒక షాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎదో ఒక పాజిటివ్ పోస్ట్ చేసే ఇర్ఫాన్ మొదటి సారి ఆయన ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లో పెట్టేశాడు. ఆయన హెల్త్ గురించి ఒక తెలియని సస్పెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

ఇర్ఫాన్ ఖాన్ కి ఒక మిస్టరీయస్ డిసిస్ ఉందట. ఆ వ్యాధి ఏంటో ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ కి కూడా తెలియదట. ఎందుకంటే డాక్టర్స్ కూడా ఆయనతో ఏ విషయాన్ని చెప్పలేదని మరో మూడు రోజుల్లో ఆ డిసిస్ ఏంటో బయటపడుతుందని ఇర్ఫాన్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రోగం ఏదైనా ఇర్ఫాన్ కి ఏం కాకుండా చూడు భగవంతుడా అని ఇర్ఫాన్ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.